ఆర్ఆర్ఆర్ సీక్వెల్ వస్తోంది

ఆర్ఆర్ఆర్.. తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయిలో మరో మెట్టు పైన నిలబెట్టిన సినిమా. విడుదలైన ప్రతి దేశంలోనూ అద్భుతమైన ప్రశంసలు అందుకున్న సినిమా. ముఖ్యంగా మన హీరోల నటనకు ఫిదా కాని దేశం లేదు. అందుకే ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమాగా ఇంటర్నేషనల్ డయాస్ పై సగర్వంగా తలెత్తుకు నిలవడమే కాదు.. ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ ను సైతం అందుకుని అద్భుతాలే సృష్టించింది.

వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలకు చెందిన కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలను ఫిక్షనలైజ్ చేసి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను రాజమౌళి తనదైన శైలిలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. ఇద్దరు స్టార్ హీరోలు చేసిన మల్టీస్టారర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ను కుడా శాటిస్ ఫై చేసేలా తెరకెక్కించాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కెరీర్ లోనే ఓ బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమా ఎండింగ్ చూసిన ఎవరికైనా మరో పార్ట్ ఉంటే బావుండు అనిపిస్తుంది. అనిపించడమే కాదు.. సీక్వెల్ వస్తే చూడాలి అని కూడా అనుకున్నారు. అలాంటి వారి కోరిక నెరవేరుతుందని స్వయంగా చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

దీంతో ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ సిద్ధం అవుతున్న విషయం బయటకు వచ్చింది. అంతే కాదు.. ఈ సీక్వెల్ లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లే హీరోలుగా ఉంటారు అని కూడా చెప్పడంతో మరోసారి ఈ మూవీపై అందరి దృష్టీ పడింది.


కాకపోతే ఈ సీక్వెల్ ఇప్పుడప్పుడే తెరరూపం దాల్చకపోవచ్చు. రాజమౌళి నెక్ట్స్.. మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నాడు. అటు రామ్ చరణ్ రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయి ఉన్నాడు. ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు.

సో.. ఈ మొత్తం కమిట్మెంట్స్ తర్వాత అందరూ ఫ్రీ అయ్యారు.. అనుకుంటే.. దానికంటే ముందు సీక్వెల్ కు కూడా అద్భుతమైన కథ కుదిరింది అనిపిస్తే.. అప్పుడు ఆర్ఆర్ఆర్ 2 కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. బట్.. కాస్త లేట్ అయినా ఈ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ చెబుతుండటంతో ఇద్దరు టాప్ యాక్టర్స్ తో రాజమౌళి మరోసారి విజువల్ వండర్ ను క్రియేట్ చేస్తాడు అనుకోవచ్చు.

Related Posts