రామ్ చరణ్‌ షురూ చేస్తుండు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి చాలా రోజులవుతోంది. శంకర్ డైరెక్షన్ లో మొదలైన గేమ్ చేంజర్ అనుకోని కారణాలతో ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

ఈ విషయంలో సరైన అప్డేట్ లేదని అభిమానులు కూడా ఓ దశలో నిర్మాణ సంస్థపై బూతులతో విరుచుకుపడ్డారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. ఈ గొడవలో ఉండగానే రామ్ చరణ్ కు కూతురు పుట్టింది. దీంతో అంతా ఇక గేమ్ చేంజర్ గురించి మర్చిపోయారు. చరణ్‌ కూతురు కోసం కొన్నాళ్లు టైమ్ స్పెండ్ చేస్తాడు అనుకున్నారు. ఆ మురిపెం కూడా అయిపోయింది. ఇక చరణ్ సెట్స్ లోకి అడుగుపెడుతున్నాడు.


ఈ వారంలోనే గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. శంకర్ సినిమా అంటే ఎంత గ్రాండీయర్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సినిమాను కూడా తన స్టైల్లోనే చిత్రీకరిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 200 మంది డ్యాన్సర్స్ తో ఓ పాట చిత్రీకరించాడు. ఇక ఇప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేసుకున్నాడు శంకర్.

త్వరలోనే ఈ యాక్షన్ మూడ్ లోకి ఎంటర్ కాబోతున్నాడు చరణ్‌. మొత్తంగా శంకర్ కంటిన్యూస్ గా ఈ సినిమానే షూటింగ్ చేయడు. తర్వాత మరో షెడ్యూల్ భారతీయుడు2 కోసం ప్లాన్ చేసుకున్నాడు. సో.. ఇలా రెండు పడవలపై కాళ్లేశాడన్నమాట.


గేమ్ చేంజర్ లో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్. తను ఇంతకు ముందు చరణ్ తో వినయవిధేయ రామలో రొమాన్స్ చేసి ఉంది. మరోసారి వీరి జోడీ రిపీట్ అవుతోంది. ఇక వీరితో పాటు సునిల్, ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, తదితర