పుష్పరాజ్ యాక్షన్ జాతర మొదలవుతోంది

‘పుష్ప ది రైజ్’.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన చిత్రమిది. ఈ సినిమాలో బన్నీ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ సరిగ్గా కుదిరాయి. అందుకే పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ‘పుష్ప ది రూల్’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ‘పుష్ప 1’ బడ్జెట్ విషయంలో పరిమితులు ఉండేవి. కానీ.. ఇప్పుడు ‘పుష్ప 2’కి అలాంటి పట్టింపులేమీ లేవు. అందుకే మొదటి భాగానికంటే నాలుగైదు రెట్లు భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్.

‘పుష్ప 1’లోని హైలైట్స్ లో యాక్షన్ పార్ట్ ఒకటి. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ను తీర్చిదిద్దిన విధానానికి మంచి అప్లాజ్ వచ్చింది. ఇక.. సెకండ్ పార్ట్ లో అంతకు మించి అన్నట్టు యాక్షన్ ఘట్టాలు అలరిస్తాయట. గత కొన్ని రోజులుగా హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన సుకుమార్.. నవంబర్ లో మాత్రం భారీ యాక్షన్ సీక్వెన్స్ కి ప్లాన్ చేశాడట. జాతర బ్యాక్ డ్రాప్ లో ఈ యాక్షన్ ఘట్టం ఉండబోతుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Related Posts