వెంకటేష్-తరుణ్ భాస్కర్ సినిమా ఉందట

వెంకటేష్ అన్ని తరహా పాత్రలు పోషించగల సత్తా ఉన్న నటుడు. అందుకే యంగ్ డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్స్ వరకూ వెంకటేష్ తో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఈకోవలోనే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా వెంకటేష్ కోసం ఓ సబ్జెక్ట్ సిద్ధం చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లింది.

తాజాగా ‘కీడా కోలా’ ప్రమోషన్స్ లో వెంకటేష్ తో సినిమా గురించి ప్రస్తావించాడు తరుణ్ భాస్కర్. వెంకటేష్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథ సిద్ధం చేశానని.. అది సురేష్ బాబుకి కూడా నచ్చడంతో షూటింగ్ కి వెళ్లిపోవచ్చు అని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నాడు. అయితే.. స్టోరీ సెకండాఫ్ తనకు శాటిస్పేక్షన్ ఇవ్వలేదని.. అందుకే ఆ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిందన్నాడు. అయితే.. కచ్చితంగా వెంకటేష్ తో ఆ సినిమాని పట్టాలెక్కిస్తానని చెప్పాడు తరుణ్ భాస్కర్.

Related Posts