తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో కొంతమంది తమదైన మార్క్ చూపిస్తే.. మరికొంతమంది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తో సత్తా చాటుతుంటారు. ఈకోవలోనే.. సెన్సిబుల్ లవ్‌స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. ఒక్కో సినిమా కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చిస్తుంటాడు ఈ విలక్షణ దర్శకుడు. ఇక ‘ఫిదా, లవ్ స్టోరీ’ విజయాల తర్వాత ధనుష్ తో తన నెక్స్ట్ మూవీని సెట్ చేశాడు.

శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలమైంది. ఈలోగా ధనుష్ రెండు, మూడు సినిమాలను విడుదల చేశాడు కూడా. కానీ.. వీరిద్దరి ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అయితే.. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుందట. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ముంబయ్, కొచ్చిన్ లలో ఎక్కువ భాగం చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.