స్కంద ట్రైలర్ లో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన సినిమా. సెప్టెంబర్ 15న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ట్రైలర్ లాంచింగ్ కోసం చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ వచ్చాడు. ఆయన రాకతో మూవీకి మరింత క్రేజ్ వచ్చింది. ట్రైలర్ బోయపాటి మార్క్ లోనే రొటీన్ గా ఉన్నా.. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా రామ్ ఈ సినిమాల డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. అందుకు తగ్గట్టుగా రెండు భిన్నమైన లుక్స్ లో ఉన్నాడు. రెండు లుక్స్ లో గడ్డం ఉన్నా.. ఒక పాత్ర కోసం పొడవైన జుత్తుతో పాటు గుబురు గడ్డం కూడా కనిపిస్తోంది. అదీ కాక బోయపాటి సినిమా అంటే కొన్నాళ్లుగా డ్యూయొల్ రోల్ మస్ట్ అన్నట్టుగా మారింది. అందుకే చాలామంది ఈ మూవీలో రామ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు అనుకుంటున్నారు.

దీనికి తోడు మరో హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ కనిపిస్తోంది. తను ఉన్నట్టు ట్రైలర్ లాంచింగ్ వరకూ తెలియదు. ఇప్పటి వరకూ తనకు సంబంధించిన ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు. ఆమె మరో పాత్రకు పెయిర్ గా నటించిందనేది కూడా అర్థం అవుతోంది.


ఇక ఈ మూవీతో దగ్గుబాటి రాజా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. రామ్ తండ్రి పాత్రలో ఆయన కనిపిస్తున్నాడు. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోగా కొన్ని సినిమాల్లోనూ ప్రధాన పాత్రకు కొడుకు, అల్లుడు తరహా పాత్రల్లో కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు. ముఖ్యంగా తమిళ్ మూవీస్ లో ఎక్కువగా నటించాడు రాజా. కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ లో త్రివిక్రమ్ రావు పాత్రలో కనిపించాడు. అటుపై జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’ అనే మూవీలోనూ నటించాడు.

అయితే ఈ పాత్ర స్ట్రాంగ్ రీ ఎంట్రీలా కనిపిస్తోంది. అలాగని ఒకప్పుడు అతను అగ్రెసివ్ పాత్రలేం చేయలేదు. బట్ ఆ తరం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్నవాడే. చాలా యేళ్ల క్రితమే చెన్నైలో సెటిల్ అయిన రాజాకు ఈ మూవీ మరిన్ని ఆఫర్స్ తెచ్చేలా కనిపిస్తోంది. మొత్తంగా వీటితో పాటు ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయో చూడాలి.

Related Posts