‘స్పిరిట్’ క్రేజీ అప్డేట్.. నిజాయితీ కలిగిన పోలీస్ గా ప్రభాస్

పోలీస్ గిరిపై టాలీవుడ్ హీరోలకు మక్కువ ఎక్కువే. అందుకే.. ఖాకీ చొక్కా వేసుకునే ఛాన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పటివరకూ టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఖాకీ పవర్ చూపించారు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో పవర్ చూపించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. తన కాంటెంపరరీ హీరోలైన పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఇలా.. అందరూ పోలీస్ డ్రెస్ లో తమ పవర్ చూపించారు. కానీ.. ఇప్పటివరకూ రెబెల్ స్టార్ ప్రభాస్ కి మాత్రం ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ‘స్పిరిట్’తో ప్రభాస్ ను పోలీస్ డ్రెస్ లో చూసే అవకాశం రాబోతుంది.

‘యానిమల్’ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగా.. లేటెస్ట్ గా ప్రభాస్ ‘స్పిరిట్’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ కలిగిన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడట. అలాగే.. ప్రభాస్ మార్క్ రెబలిజమ్.. తన మార్క్ వైలెన్స్ ఖచ్చితంగా ఈ మూవీలో ఉంటాయని ఫ్యాన్స్ కి మాటిచ్చాడు. ఇప్పటికే ‘స్పిరిట్’ రైటింగ్ 60 శాతం పూర్తయ్యిందని.. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నామని తెలిపాడు సందీప్. డిసెంబర్ నుంచి ‘స్పిరిట్’ పట్టాలెక్కనుంది

Related Posts