వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు లైన్ క్లియర్

నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటించిన వీర సింహారెడ్డి మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాతలు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మళయాలీ బ్యూటీ హనీ రోజ్ ఓ కీలక పాత్రలో నటించింది. బాలయ్య అఖండ వంటి రోరింగ్ హిట్ తర్వాత.. గోపీచంద్ క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ సైతం ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో నిర్వహించాలనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు.. బట్ మూడు రోజుల ముందు జగన్ ప్రభుత్వం ఈ ఫంక్షన్ కు షాక్ ఇచ్చింది. ఒంగోలు పట్టణం చిన్నగా ఉంటుందని.. బాలయ్య ఫంక్షన్ అంటే అభిమానులు భారీగా వస్తారని.. అందువల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. సడెన్ గా వచ్చిన ఈ షాక్ కు మూవీ టీమ్ డిజప్పాయింట్ అయింది. జగన్ గతంలో బాలయ్యకు అభిమాని. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. అయినా నిర్ధాక్షిణ్యంగా ఒంగోలు నుంచి వేరే చోటుకు మార్చుకోవాలని ఆర్డర్ వేశారు. దీంతో అసలు ఈ ఫంక్షన్ ఉంటుందా లేదా అని మల్లగుల్లాలు పడుతోన్న ఫ్యాన్స్ కు ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్.


వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెన్యూను మార్చారు. అలా మార్చుకుంటే అభ్యంతరం లేదు అని పోలీస్ లు లైన్ క్లియర్ చేశారు. దీంతో ఇప్పుడు ఒంగోలు పట్టణం నుంచి శివారు ప్రాంతానికి వేదిక మారింది. కొత్త వేదికగా ఒంగోలు బై పాస్ రోడ్ లో ఉండే బిఎమ్ఆర్ మహానాడు గ్రౌండ్ ను ఎంచుకున్నారు. ఇక్కడైతే ఊహించినదానికంటే ఎక్కువ అభిమానులు వచ్చినా పెద్దగా సమస్య రాదు. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తదు.


మొత్తంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అటు రాయలసీమ ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చే అవకావం ఉంది. ఇటు కృష్ణా, గుంటూర్ వాళ్లు ఎలాగూ వస్తారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పటికే ఫ్యాన్స్ ఒంగోలు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. మొత్తంగా వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఉన్న కన్ఫ్యూజన్ తొలగింది. ఊరు మారలేదు కానీ వేదిక మారింది అంతే.

Related Posts