ఎన్టీఆర్.. ఈ మూడక్షరాల పేరు తెలుగు సినిమా పరిశ్రమలో శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాయి. ఆ అక్షరాలనే తన పేరుగా పెట్టుకుని ఆ కీర్తికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్దాయన లేరు కాబట్టి ఇప్పుడు ఆ జూనియర్ ను కూడా తీసేసి తనే ఎన్టీఆర్ గా తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప నటుడుగా రాణిస్తున్నాడు. ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ అనేందుకు ఎన్నో సినిమాలు, సీన్స్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తాయి. అయితే అతని పొటెన్షియల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

వాల్డ్ ఆడియన్స్ అయితే మెస్మరైజ్ అయిపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని వారు లేరు అనే చెప్పాలి. సినిమా పరంగా తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా తన నటనతో సినిమాలో తిరుగులేని ముద్ర వేశాడు. అంతా తనవైపే చూసేలా చేసుకున్నాడు. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో అతని అనితర సాధ్యమైన నటన చూసి ఎంతోమంది ఆశ్చర్యపోయారు. అందుకే ఆ నటనకు అత్యుత్తమ ఆస్కార్ అవార్డ్ రావాల్సిందే అని మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అంతా కోరుకున్నారు.. డిమాండ్ చేశారు.


అంతా కోరుకున్నట్టుగానే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ కు చోటు దక్కింది. ఆస్కార్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో టాప్ టెన్ లో ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నాడు. అతను పదో స్థానంలో నిలిచాడు. అయితే ఒక భారతీయ నటుడు ఆస్కార్ బెస్ట్ యాక్టర్స్ కేటగిరీలో టాప్ టెన్ లో చోటు సంపాదించుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. అంటే ఆస్కార్ అవార్డ్ కు అత్యంత దగ్గరగా వెళ్లిన ఫస్ట్ ఇండియన్ యంగ్ టైగర్ కావడం విశేషం. ఇప్పటి వరకూ భారత దేశం నుంచి ఎంతోమంది మహా నటులు ఈ అవార్డ్ కోసం ప్రయత్నించారు.

బట్ టాప్ టెన్ కు వెళ్లిన ఏకైక ఇండియన్ గా ఎన్టీఆర్ నిలవడం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం అని చెప్పొచ్చు. అతను ఈ అవార్డ్ సాధిస్తాడా లేదా అనేది పక్కన బెడితే.. ఇక్కడి వరకూ వెళ్లడంలోనే విజయుడైనట్టుగానే భావించాలి. ఏదేమైనా తెలుగు 70ఎమ్ఎమ్ తరఫు నుంచి మన ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్ ను కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

, , , , , , , , , , ,