లేదు లేదంటూనే విజయ్, రష్మి చెట్టా పట్టాల్

ఇండస్ట్రీలో ఎఫైర్స్ ను ఎంత దాచినా దాగవు. మొదట రూమర్ గానే మొదలైనా.. నిజం కావడానికి పెద్ద టైమేం పట్టదు. నిజానికి ఆరంభంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య ఏదో ఉందని.. గీత గోవిందం టైమ్ లో వారి మధ్య నడిచిన ట్విట్టర్ రొమాన్స్ టైమ్ లోనే చాలామంది అనుకున్నారు. ఈ కారణంగానే అప్పట్లోనే రష్మికపై కన్నడలో చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.

విశేషం ఏంటంటే అప్పటికి తన ఎంగేజ్మెంట్ ఇంకా క్యాన్సిల్ కాలేదు. ఈ ట్విట్టర్ రొమాన్స్ తర్వాతే విడిపోయారు కూడా. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడం.. ఈ మూవీలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడంతో క్రేజీ కపుల్ గానూ మారారు. ఆ క్రేజ్ తోనే తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనూ కనిపించారు. ఈ మూవీ పోయినా… వారి బంధం నిలబడింది. క్రమంగా బలపడింది. చాలామందికి తెలియదు కానీ.. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు దాదాపు ఫిక్స్ అయిపోయారనే చెబుతారు.

రష్మిక తరచూ విజయ్ దేవరకొండ ఇంటికే వెళుతుందనే వారూ ఉన్నారు. తనను విజయ్ పేరెంట్స్ కూడా “కాబోయే ఇంటిమనిషి”లాగానే ట్రీట్ చేస్తారట. ఇక ఆ మధ్య ఆనంద్ దేవరకొండ బర్త్ డే టైమ్ లో ఈ ఇద్దరూ కలిసి ఒకే రిసార్ట్ లో కనిపించారు. విజయ్ టీమ్ కాదని ఖండించినా.. అక్కడి ఫోటోస్ ద్వారా దొరికిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి అలా దొరికిపోయిందీ జంట.


రీసెంట్ గా న్యూ ఇయర్ పార్టీని వేరే కంట్రీలో చేసుకున్నారు విజయ్, రష్మిక. ఇద్దరూ ఒకే పూల్ లో ఉన్న ఫోటోస్ వేర్వేరుగా వచ్చాయి. అయితే ఆ ఫోటోస్ వెనక ఉన్న ఇల్లు ద్వారా కలిసే ఉన్నారని తేలిపోయింది. ఇక లేటెస్ట్ గా మరో ఆధారం వచ్చింది.

ఆ ప్లేస్ లోని బీచ్ నుంచి ఆ రాత్రి రష్మిక మందన్నా ఫ్యాన్స్ తో వీడియో కాల్ లో ఇంటరాక్ట్ అయింది. ఆ కాల్ మాట్లాడుతున్నప్పుడు పక్కన విజయ్ దేవరకొండ వాయిస్ కూడా రికార్డ్ అయింది. ఇక విజయ్ దేవరకొండ వాయిస్ ను గుర్తుపట్టని వారు ఉంటారా..? అందుకే మరోసారి ఈ ఇద్దరూ కలిసే న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేయడానికి వెళ్లారని తేలిపోయింది.


మరో న్యూస్ ఏంటంటే.. ఈ ఇద్దరూ కావాలనే తమ గురించి ఇలా లీకులు ఇస్తున్నారు అనే వారూ ఉన్నారు. తర్వాతెప్పుడైనా తెలిసినా.. ఇది అందరికీ తెలిసిందే కదా అని లైట్ తీసుకుంటారనే కావొచ్చు.. ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు. బట్.. టాలీవుడ్ లో ఈ ప్రేమజంట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

Related Posts