కమల్ హాసన్ ‘థగ్ లైఫ్‘ షూటింగ్ మొదలైంది

దాదాపు 36 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘థగ్ లైఫ్‘. అనౌన్స్ మెంట్ టీజర్ తోనే ‘థగ్ లైఫ్‘పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కమల్ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేటెస్ట్ గా షూటింగ్ మొదలుపెట్టుకుంది.

కమల్ తో తీసిన గత చిత్రం ‘నాయకుడు‘ తరహాలోనే టిపికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అన్బారివ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ కి జోడీగా త్రిష నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో జయం రవి, దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కనిపించనున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Related Posts