కులాంతర ప్రేమకథగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘

ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో పీరియడ్ లవ్ స్టోరీగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ రాబోతుంది. మ్యారేజ్ బ్యాండ్ సభ్యుడిగా సుహాస్ మేకోవర్, మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ లో చూశాం. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. ఇప్పటివరకూ చూసిన ప్రచార చిత్రాలలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ గా మాత్రమే అనిపించిన ఈ మూవీలో కులాల పట్టింపులకు సంబంధించిన కథాంశం కూడా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.

హీరోహీరోయిన్లు సుహాస్, శివాని మధ్య ప్రేమ సన్నివేశాలతో ఆహ్లాదంగా మొదలైన ట్రైలర్ లో.. కులాల మధ్య పట్టింపులతో హీరో ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అలాగే.. ఆ ఊరిలో టీచర్ గా పనిచేసే అమ్మాయి కథేంటి? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీవాసు, వెంకటేష్ మహా, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శేఖర్‌ చంద్ర ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts