తెలుగు సినిమాల ప్రచారంలో మొదటగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం ఆనవాయితీ. సినిమా విడుదల తర్వాతే వీడియో సాంగ్స్ ను వదులుతుంటారు. అయితే.. ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ రిలీజయ్యింది. ఇప్పటికే లిరికల్ గా ఆకట్టుకున్న వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ ఫుల్ వీడియోని విడుదల చేసింది టీమ్.
లావిష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించారు. పాటలో వధూవరులుగా విజయ్ దేవరకొండ, మృణాల్ మెరిసిపోయారు. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ పాటలోని కాస్ట్లీ సెట్ ప్రాపర్టీస్ ఆకట్టుకుంటున్నాయి. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఈ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ తెలుగుతో పాటు తమిళంలోనూ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.