రివ్యూ : జవాన్
తారాగణం: షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకోణ్, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునిల్ గ్రోవర్ తదితరులు
ఎడిటింగ్: రూబెన్
సంగీతం: అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: జికే విష్ణు
నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ
దర్శకత్వం: అట్లీ

జవాన్.. ఈ సినిమాపై ముందు నుంచీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు అట్లీ .. షారుఖ్ ఖాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు అన్నప్పుడే సౌత్ లోఅంచనాలు మొదలయ్యాయి. బాలీవుడ్ కు ముందు తెలియకపోయినా ఫస్ట్ ట్రైలర్ రాగానే పఠాన్ ను మించి అనుకున్నారు. తర్వాతి ట్రైలర్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు మొదలయ్యాయి. ఈ చిత్రానికి ఏకంగా 12లక్షల టికెట్స్ రిలీజ్ కు ముందే అమ్ముడు పోయాయి. అంటే ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. అయితే ఊహలు నిజం అవుతాయా లేదా అనేది సినిమా వస్తే కానీ తెలియదు కదా.. అలా ఇవాళ విడుదలైన జవాన్.. అందరి అంచనాలను అందుకుందా.. ? కంప్లీట్ సౌత్ ఫ్లేవర్ తో కనిపించిన ఈ బాలీవుడ్ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం..

కథ :
విక్రమ్ రాథోడ్( షారుఖ్ ఖాన్) ఓ మెట్రో ట్రెయిన్ ను హైజాక్ చేస్తాడు. అతనికో టీమ్ ఉంటుంది. అందరూ అమ్మాయిలే. వారి సాయంతోనే ఈ హైజాక్ కు పాల్పడతాడు. అయితే అతన్ని డీల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ అయిన నర్మద(నయనతార) వస్తుంది. నర్మదతో ఐదు నిమిషాల్లో సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ రావాలని చెబుతాడు. అతను వచ్చాక తన డిమాండ్ గా ఓ బడా వ్యాపారవేత్త 40వేల కోట్లు ఇవ్వాలని చెబుతాడు. ఆ బిజినెస్ మేన్ డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తాడు. మెట్రో స్టేషన్ లో వారిని పట్టుకోవాల్ని ప్రయత్నించిన బలగాలను దాటుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత వారి టార్గెట్ హెల్త్ మినిస్టర్. అతన్ని కిడ్నాప్ చేస్తారు. మరోవైపు ఆజాద్(షారుఖ్ ఖాన్) జైలర్. అతను నర్మదను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పటికే నిర్మదకు ఓ కూతురు ఉంటుంది. ఆ పాపను కూడా అంగీకరించి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇటు హెల్త్ మినిస్టర్ కోసం వచ్చిన నర్మదకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. వాటిని బట్టి ఆ విక్రమ్ రాథోడ్ ఎలా ఉంటాడో స్కెచ్ లు వేయిస్తుంది. అదే రోజు తన పెళ్లి. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న టైమ్ లో వారిపై దాడి జరుగుతుంది. ఆ సమయంలోనే తను వెదుకున్న విక్రమ్ రాథోడ్, ఆజాద్ ఒక్కరే అని తెలుస్తుంది నర్మదకు. ఆ దాడిలో విలన్స్ కు దొరికిపోయిన వీరిని మరో వ్యక్తి వచ్చి కాపాడతాడు.. అతనెవరు..? ఆ తర్వాతేమైంది. అసలు విక్రమ్ రాథోడ్, ఆజాద్ లుఎవరు..? అతని టీమ్ లో ఉన్న అమ్మాయిలు ఎవరు..? విక్రమ్ రాథోడ్ ఈ కిడ్నాపులు చేయడం వెనక మోటో ఏంటీ..? అనేది మిగతా కథ.

ఎలా ఉంది.

ఒక కమర్షియల్ సినిమాను ఎలా మొదలు పెట్టాలో అలానే స్టార్ట్ చేశాడు అట్లీ. ఆరంభంలోనే ఓ పెద్ద విమానం నుంచి కింద పడిపోయిన షారుఖ్ ను అడవిలో ఉన్న గిరిజనం కాపాడటం.. కొన్ని నెలల తర్వాత గిరిజనులపై సాయుధ బలగాలు దాడి చేస్తే.. అతను కాపాడతాడు. కట్ చేస్తే మెట్రో రైల్ హైజాక్. ఇక్కడి నుంచి కథ వేగంగా పరుగులు పెడుతుంది. ప్రతి సీన్ ను ఓ ఎలివేషన్ సీన్ లానే రాసుకున్నాడు అట్లీ. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన ట్విస్ట్ అదిరిపోతుంది. అదే టైమ్ లో వ్యవసాయ శాఖమంత్రికి, 40 వేల డబ్బుకు సంబంధించి ఉన్న లింక్ ను అత్యంత హృద్యంగా చెప్పాడు. ఆ ఎపిసోడ్ మొత్తం తన టీమ్ లోని ఓ అమ్మాయి కథగా గుండెల్ని పిండేస్తుంది. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ కిడ్నాప్ వెనక ఉన్న మరో ఉపకథ, ఆ కథలోని అమ్మాయి డాక్టర్.. తన టీమ్మేట్. ఇలా తన టీమ్ లో ఒక్కొక్క అమ్మాయిది ఒక్కో సమస్య. అవన్నీ సామాజిక సమస్యలే. ఆ సమస్యలను రూపు మాపేందుకు వీళ్లు ఎంచుకున్న మార్గమే కిడ్నాప్. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా తగ్గలేదు. సీన్ బై సీన్ ఓ రేంజ్ లో గ్రాఫ్‌ పెరుగుతూ పోతూనే ఉంటుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ ను మించిన యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించాడు. అటు నయనతార పాత్రను కూడా బలంగా రాసుకున్నాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించేదే అయినా గూస్ బంప్స్ వచ్చేలా పిక్చరైజ్ చేశాడు.


ఇక సెకండ్ హాఫ్ లో మరో షారుఖ్ ఖాన్ ఎంటర్ కావడం.. అతను గతం మర్చిపోయినా.. తన “టీమ్” ద్వారా ఆజాద్ తన కొడుకు అని తెలుసుకోవడం.. అలాగే నయనతారకు ఆజాద్అలా ఎందుకు చేస్తున్నాడు అంటూ అతని తల్లికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఏదీ తక్కువగా చూసే ఛాన్స్ లేకుండా రాసుకున్నాడు అట్లీ. విశేషం ఏంటంటే.. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, సెకండ్ హాఫ్ లో విలన్ తో తలపడేందుకు కారణమైన ఆర్మీ ఎపిసోడ్ కానీ ఏదీ కొత్తది కాదు. బట్ అతను ఆ సీన్స్ ను హై స్టాండర్డ్స్ లో రాసుకున్నాడు. పాత సీన్సే అయినా.. షారుఖ్ ప్రెజెన్స్ తో పాటు దానికి ఇచ్చిన ఎమోషనల్ టచ్ అద్భుతంగా వర్కవుట్ కావడంతో అసలు ఇది ఓల్డ్ స్టోరీ అన్నది గుర్తుకు రాకుండా పోతుంది. ముఖ్యంగా దీపికా పడుకోణ్ ను ఎందుకు రిపీట్ చేశారు అన్న వారికి జైల్ లో ఆమె తన చివరి రోజును కొడుక్కి ఎక్స్ ప్లెయిన్ చేస్తూ చూపిన నటన సమాధానం చెబుతుంది. ఆ సీన్ కూడా కొత్తది కాదు. బట్ సినిమాలో ఓ హైలెట్ గా ఉంటుంది. విలన్ పాత్ర మరీ బలంగా లేకపోవడం కొంత మైనస్ గా ఉంటుంది. కానీ ఆ పాత్రను బలంగా మార్చింది విజయ్ సేతుపతి నటన. తండ్రి కొడుకులకు ఒక్కడే విలన్ కావడంతో మరింత రక్తి కడుతుంది. అందుకు తగ్గట్టుగా విజయ్ గెటప్స్ కూడా మారతాయి.


ఎలా చూసినా ఇది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎక్కడా ఒక్క డల్ మూమెంట్ ఉండదు. స్క్రీన్ ప్లే గ్రాఫ్ అలా పెరుగుతూ పోతూనే ఉంటుంది. నిజంగా ఓ కిచిడీ కథను ఇంత టేస్టీగా వండొచ్చు అని అట్లీని చూసి నేర్చుకోవచ్చు. ఇందులో చాలా సీన్స్ సౌత్ వారికి తెలిసినవే. కానీ నార్త్ లో మాత్రం అవి మరో స్థాయిలో వర్కవుట్ అవుతాయి. అఫ్ కోర్స్ మనకూ పాతవే అన్న ఫీలింగ్ రాకుండ చూసుకున్నాడు.

నటన పరంగా షారుఖ్ ఖాన్ సింప్లీ సూపర్బ్. కంప్లీట్ గా దర్శకుడికి సరెండర్ అయిపోయాడు. ఏం చేసినా తనకు ఓ బ్లాక్ బస్టర్ పడితే చాలు అన్నట్టుగా చెలరేగిపోయాడు. రెండు వైవిధ్యమైన పాత్రల్లోఅదరగొట్టాడు. నయనతార కూడా ఆ పాత్రకు తగ్గ స్టేచర్ ను మెయిన్టేన్ చేసింది. తనకు ఇది బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ అవుతుంది. ఇతర పాత్రల్లో రైతు కూతురుగా చేసిన అమ్మాయితో పాటు డాక్టర్ గా నటించిన సాన్య మల్హోత్రా, ప్రియమణి పాత్రలకు మేరకు తమదైన ఇంపాక్ట్ చూపించారు. చివర్ లో సంజయ్ దత్ కేమియో కూడా అదిరిపోయింది. ఇక విజయ్ సేతుపతి ఎప్పట్లానే తను మాత్రమే ఇలా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.

టెక్నికల్ గా మరోసారి అనిరుద్ రవిచందర్ తనెంత వాల్యూబుల్ మ్యూజిషియన్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. పాటలు బావున్నాయి. నేపథ్యం సంగీతం అద్దిరిపోయింది. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. ఫైట్స్, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, సెట్స్, కాస్ట్యూమ్స్, మేకప్ తో సహా అన్ని క్రాఫ్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారని అర్థం అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచెస్ట్ గా కనిపిస్తాయి.


దర్శకుడుగా అట్లీ బాలీవుడ్ కు గ్రాండ్ గా తనను తాను ఇంటర్ డ్యూస్ చేసుకున్నాడు. కిచిడి కథనే టేస్టీగా వండి కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను అందించాడు. అదనంగా తన మార్క్ ఎమోషన్స్ ను యాడ్ చేయడంతో ఇది పఠాన్ ను మించే కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యం లేదు అనిపించాడు.

ప్లస్ పాయింట్స్

షారుఖ్ ఖాన్
నయనతార
కథనం
సినిమాటోగ్రఫీ
నేపథ్య సంగీతం, పాటలు
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ

ఫైనల్ గా : జై జవాన్
రేటింగ్ : 3.5/5

                            - బాబురావు. కామళ్ల

Related Posts