సలార్.. మరో ఆదిపురుష్ కాబోతోందా..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా విషయంలో ఏం జరుగుతోందనే క్లారిటీ ఎవరిలోనూ లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. బట్ వాటికి తగ్గట్టుగా అప్డేట్స్ ఇవ్వడంలో కూడా సినిమా టీమ్ ముందు నుంచీ ఫెయిల్ అయింది. సరే హైప్ కోసం అలా చేస్తున్నారేమో అనుకుంటే.. అంత లేదు అని ఇప్పటికే అభిమానులు కూడా ఓ అంచనాకు వచ్చి ఉన్నారు. ఈ నెల 28న విడుదలవుతుందని ఫ్యాన్స్ అంతా కొండంత ఆశతో ఉంటే.. వారి ఆశలను అడియాశలు చేశాడు ప్రశాంత్ నీల్. కనీసం సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న విషయాన్ని కూడా అఫీషియల్ గా చెప్పలేదు. ఓ రకంగా ఇది వారిని అవమానించినట్టే అనుకోవాలి. ఎంతసేపూ కేవలం బిజినెస్ యాంగిల్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కోణంలోనే ఆలోచించారు వీళ్లు.


ఏ సినిమా అయినా వాయిదా పడిందీ అంటే మళ్లీ కొత్త డేట్ ఎప్పుడూ అనే చూస్తారు. ఈ విషయంలోనే సలార్ పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకు సిజి వర్క్ సరిగా లేని కారణంగా .. అదీ కొన్ని సీన్స్ లోనే అన్నారు. బట్ ఇంటర్నల్ గా వినిపిస్తోన్న విషయాలు చూస్తే.. ఈ మూవీ సిజి వర్క్ మాత్రమే కాదు.. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా సరిగా లేవు అంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఆదిపురుష్ గుర్తుకు రావడం ఖాయం. ఆదిపురుష్ ను కూడా ఇలాగే హైప్ చేశారు. ఫస్ట్ టీజర్ కే పాతాళంలోకి వెళ్లిందా హైప్. దీంతో రిలీజ్ డేట్ ను ఏకంగా ఎనిమిది నెలల పోస్ట్ పోన్ చేశారు. అయినా అవుట్ పుట్ గొప్పగా రాలేదు. అది ఈ సినిమా విజయంపైనే ప్రభావం చూపించింది. దానికి తోడు కంటెంట్ కూడా వీక్ గా ఉంది.

సో ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే రిపీట్ అయిందనే వార్తలు శాండల్ వుట్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఏదో అనుకుని ఇంకేదో తీశాడనీ.. కేజీఎఫ్ తో లింక్ సెట్ కాలేదనీ.. అలాగే ఈ సినిమా సోలోగా ఆకట్టుకుంటుందా అంటే అదీ సమస్యగానే ఉందంటున్నారు.


ఈ కారణాల వల్లే ఇప్పుడు కేజీఎఫ్ తో లింక్ కట్ చేసి.. సలార్ సెపరేట్ మూవీ అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీకి వాళ్లూ రాలేకపోతున్నారు. అందుకే డేట్ చెప్పడం లేదు. మరోవైపు కొత్త డేట్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో నవంబర్, డిసెంబర్ అని వారికి మాత్రమే చెబుతున్నారట. అదే విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయమంటే అదీ కుదరదంటున్నారని టాక్. కాకపోతే డిసెంబర్ చివరి వారంలో ఖచ్చితంగా విడుదల చేస్తాం. కానీ అఫీషియల్ గా ఇప్పుడే ప్రకటించలేము అని వారికి సర్ది చెబుతున్నారట. ఏదేమైనా ఈ మూవీ విషయంలో ఈ సారి ప్రశాంత్ నీల్ అభిమానుల ఆగ్రహాన్ని బలంగానే చూడబోతున్నాడు అంటున్నారు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ధైర్యంగా ఒక అప్డేట్ తో వస్తే బెటర్. లేదంటే ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎవరికి తోచింది వాళ్లు అంటూనే ఉంటారు. అది సినిమాకే ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత తీరిగ్గా బాధపడితే ఉపయోగం లేదు.

Related Posts