రూల్స్ రంజన్ మంచి నిర్ణయం

సినిమాలు ఎక్కువైతే కలెక్షన్స్ తగ్గుతాయి. అఫ్ కోర్స్ పెద్ద సినిమాలకు బానే ఉంటుందనుకోండి. ఎటొచ్చీ చిన్న సినిమాలే నలిగిపోతుంటాయి. కొందరు మాత్రం తెలివిగా తప్పించుకుంటారు… రూల్స్ రంజన్ లాగా. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా రత్తినకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాలనుకున్నారు. ఆ రోజు రావాల్సిన సలార్ వాయిదా పడటంతో ఇతనితో పాటు మ్యాడ్, పెదకాపు1 చిత్రాలు కూడా ఆ డేట్ ను ఆక్యు పై చేశాయి.

అనూహ్యంగా 15న రావాల్సిన స్కంద, చంద్రముఖి2 తమ చిత్రాన్ని 28కి వాయిదా వేశాయి. దీంతో ఇప్పుడు మొత్తం ఐదు సినిమాలు అయ్యాయి. ఈ పోటీలో ఉంటే ఖచ్చితంగా థియేటర్స్ ప్రాబ్లమ్ వస్తుందనుకున్నారు. అందుకే రూల్స్ రంజన్ ను వాయిదా వేశారు.


రూల్స్ రంజన్ కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ 6. ఆ రోజు కూడా మూడు సినిమాలున్నాయి. మామా మశ్చీంద్రా, డిజే టిల్లు స్క్వేర్, మంత్ ఆఫ్ మధు. వీటిలో డిజే టిల్లు వాయిదా పడే అవకాశాలున్నాయంటున్నారు. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు.

ఈ డేట్ లోకే రూల్స్ రంజన్ వచ్చాడు. ఇవన్నీ మీడియం రేంజ్ మూవీస్ కాబట్టి ఎవరికీ పెద్దగా ప్రాబ్లమ్ లేదు. పైగా ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ ను బట్టి చూస్తే రూల్స్ రంజన్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిలేరియస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.

ఈ పాజిటివ్ టాక్ ను టికెట్స్ గా మలచుకోవాలంటే భారీ పోటీ మధ్య కాక మీడియం రేంజ్ కాంపిటీషన్ లో ఉంటేనే బెటర్. సో.. రూల్స్ రంజన్ పోస్ట్ పోన్ కావడం వారికే పెద్ద ప్లస్ అవుతుంది.

Related Posts