మార్చిలో హిట్టైన చిత్రాలు.. ఓటీటీ లోకి వచ్చేశాయి!

మార్చిలో మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో ‘గామి’ ఒకటి. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి యు.వి.క్రియేషన్స్ సమర్పకులుగా వ్యవహరించింది. ప్రచార చిత్రాలతో ఓ విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘గామి’.. థియేటర్లలో ఆడియన్స్ కి సరికొత్త విజువల్ ట్రీట్ అందించింది.

అంతకుముందు ఎక్కువగా యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ చేసిన విశ్వక్ సేన్ ఇలాంటి ఓ ప్రయోగాత్మక సినిమా చేయడం.. అందులో సఫలీకృతుడవ్వడం ‘గామి’తో జరిగింది. తక్కువ బడ్జెట్ లో క్రౌడ్ ఫండింగ్ తో పెద్ద కాన్వాస్ తో వచ్చిన ‘గామి’ విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇప్పటికే థియేటర్లలో హిట్టైన ‘గామి’ చిత్రం ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

మార్చి నెలలోనే విడుదలైన తెలుగు చిత్రాల్లో ‘ఓం భీమ్ బుష్’ ఒకటి. నాన్ స్టార్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా.. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ని కూడా యు.వి.క్రియేషన్స్ తీసుకొచ్చింది. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆడియన్స్ కి నవ్వుల ట్రీట్ అందించింది. ప్రస్తుతం ‘ఓం భీమ్ బుష్’ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

తొలుత మలయాళం ప్రేక్షకుల్ని ప్రేమమైకంలో ముంచెత్తిన ‘ప్రేమలు’.. తెలుగు ఆడియన్స్ కి కూడా అదే పేరుతో లవ్ ట్రీట్ అందించింది. అచ్చమైన తెలుగు టైటిల్ తో మాలీవుడ్ ని ఊపేసిన ఈ హైదరాబాదీ స్టోరీకి.. తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రేమకథా చిత్రాలకు బాషతో సంబంధం లేదు.. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ఏ భాషా ప్రేమికులైనా ఆదరిస్తారు అనడానికి ‘ప్రేమలు’ పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్. ‘ప్రేమలు’ చిత్రం హాట్ స్టార్, ఆహా వేదికలుగా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.

Related Posts