రాబోయే క్రేజీ మూవీస్ లో హైలైట్ సీన్స్ ఇవే!

ప్రస్తుతం తెలుగు నుంచి రాబోయే క్రేజీ మూవీస్‌లో ‘దేవర, పుష్ప 2, ఓజీ, గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలున్నాయి. టాలీవుడ్ బడా స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందించే విధంగా.. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేసే దిశగా.. ఈ సినిమాల్లో పలు సీక్వెన్సెస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాయట.

ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ గురించి వద్దాం. ఇప్పటికే ఎన్టీఆర్ కి ‘జనతాగ్యారేజ్’ వంటి బడా హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ‘దేవర’ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఆద్యంతం సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.

‘దేవర’ సినిమాలో అండర్ వాటర్ లో వచ్చే సీక్వెన్సెస్ అయితే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయట. హై ఎండ్ టెక్నాలజీతో హాలీవుడ్ స్టాండార్డ్స్ లో ఈ అండర్ వాటర్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించాడట డైరెక్టర్ కొరటాల శివ. అంతే కాదు.. ఈ సినిమాలో వచ్చే ఓ ఆయుధ పూజ సీక్వెన్స్.. అందులో వచ్చే సాంగ్, ఫైట్ కూడా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ ఈ ఏడాది ఆగస్టులో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ముందు నుంచీ చెప్పుకున్నట్టే ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ అయితే ఓ రేంజులో ఉండబోతుందట. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఆ సీక్వెన్స్ లో వచ్చే ఫైట్స్, సాంగ్ ఇలా.. మొత్తం ఎపిసోడ్ ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టేలా తీర్చిదిద్దాడట డైరెక్టర్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్. ఇప్పటికే ఆ జాతర ఎపిసోడ్ కి సంబంధించి స్మాల్ గ్లింప్స్ టీజర్ రూపంలో వదిలారు.

ఈ ఏడాది రాబోతున్న చిత్రాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తీర్చిదిద్దుతున్న మేగ్నమ్ ఓపస్ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో కనువిందు చేయబోతున్నాడు. ముఖ్యంగా.. చరణ్ పోషిస్తున్న రెండు క్యారెక్టర్లను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట శంకర్. ఇక.. భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్.. ‘గేమ్ ఛేంజర్’లోని ప్రతీ సీక్వెన్స్ ను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆమధ్య ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ ఒక్క పాట కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెట్టించాడు శంకర్.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ఓ సరికొత్త స్టాండార్డ్స్ సెట్ చేస్తుందనే టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ‘సాహో’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసిన సుజీత్ ‘ఓజీ’ మూవీని అంతకు మించి అన్న రీతిలో డిజైన్ చేశాడట. ఈ సినిమాలో వచ్చే కమ్ బ్యాక్ ఆఫ్ ఓజాస్ గంభీర సీక్వెన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

Related Posts