సల్మాన్ ఖాన్ తో మురుగదాస్ ‘సికందర్’ చిత్రం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి సౌత్ కంటెంట్ పై ఎంతో నమ్మకం. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న సమయంలో దక్షిణాది చిత్రాల రీమేక్స్ తోనే మళ్లీ విజయపరంపర మొదలుపెట్టాడు. అప్పట్లో దాదాపు ఓ అరడజను సినిమాలను హిందీలోకి తీసుకెళ్లి.. ఘన విజయాలందుకున్నాడు. మళ్లీ చాలా కాలం తర్వాత సౌత్ టాలెంట్ ను నమ్ముకుంటున్నాడు సల్లూభాయ్.

సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే ఏ.ఆర్.మురుగదాస్ తో సల్మాన్ సినిమా చేయబోతున్నాడట. గతంలో అమీర్ ఖాన్ కి ‘గజిని’ వంటి మెమరబుల్ హిట్ అందించాడు మురుగదాస్. ఆ తర్వాత అక్షయ్ తో ‘తుపాకీ’ రీమేక్ ‘హాలిడే.. ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ని తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో బడా హీరో సల్మాన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 2025, ఈద్ కానుకగా సల్మాన్-మురుగదాస్ చిత్రం విడుదలకానుందట. సాజిద్ నదియడ్ వాలా నిర్మాణంలో రూపొందే ఈ మూవీకి ‘సికందర్’ అనే టైటిల్ ఫిక్సైంది. ప్రస్తుతం మురుగదాస్.. శివకార్తికేయన్23 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Posts