సరికొత్త ఫార్మాట్ లో ‘గామి’ ట్రైలర్

మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో విశ్వక్ సేన్ ‘గామి’ ఒకటి. ఇప్పటివరకూ విశ్వక్ సేన్ చేసిన సినిమాలు ఇంచుమించు ఒకే తరహాలో ఉంటే.. ఈ చిత్రం మాత్రం విభిన్నమైన కథాంశంతో తెరకెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే ‘గామి’పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎప్పుడైతే మేకింగ్ వీడియో, సాంగ్, టీజర్ రిలీజయ్యాయో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ కి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయ్యింది.

ఫిబ్రవరి 29న సాయంత్రం 4 గంటలకు ‘గామి’ ట్రైలర్ ను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను PCX ఫార్మాట్ లో.. హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి ఇతర కీ రోల్స్ పోషించారు. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకుడు. మార్చి 8న ‘గామి’ విడుదలకాబోతుంది.

Related Posts