ఫైనల్ గా సలార్ నుంచి ఒక స్పందన

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. కొన్ని సీన్స్ లో సిజి వర్క్ బాగా లేదు అందుకే మళ్లీ చేస్తున్నాం అనే కారణంపైకి కనిపించింది. కానీ అసలు కారణం ఏంటనేది మూవీ టీమ్ చెప్పలేదు. సరే కొన్ని పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్స్ వాయిదా పడటం కామన్ కదా.. అందుకే ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. పోనీ కొత్త డేట్ అయినా చెబుతారా అంటే అదీ లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా హర్ట్ అయిపోయారు. ఇంకా చెబితే చాలా రోజులుగా వీళ్లు ఆడియన్స్ ను అసలు సీరియస్ గా తీసుకోలేదు అనే చెప్పాలి. అది సినిమాపై ప్రభావం చూపిస్తుందని.. ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా రకరకాలుగా అనుకుంటారు అని తెలిసినా పట్టించుకోలేదు. దీంతో ఈ చిత్రం కూడా ఆదిపురుష్ లా అవుతుందా అని వార్తలు మొదలయ్యాయి. అప్పుడు స్పందించింది మూవీ టీమ్. ఫైనల్ గా సలార్ టీమ్ నుంచి ఒక్క అప్డేట్ వచ్చింది. అది కూడా స్పష్టమైన రిలీజ్ డేట్ లేకుండానే. హొంబలే ఫిల్మ్స్ పేరుతో ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. అందులో ఏముందీ అంటే..


” #Salaar కోసం మీ తిరుగులేని మద్దతును మేము ఎంతో అభినందిస్తున్నాము. మీ మద్ధతును పరిగణలోకి తీసుకునే ఈ అప్డేట్ ఇస్తున్నాం. అనుకోని పరిస్థితుల కారణంగా మేము అసలు సెప్టెంబర్ 28 విడుదలను అందుకోలేకపోయాము. మీ అందరికీ ఒక అసాధారణమైన సినిమా అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నందున, ఈ నిర్ణయం తీసుకున్నట్లు దయచేసి అర్థం చేసుకోండి. అత్యున్నత ప్రమాణాలను అందుకోవడానికి మా టీమ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. కొత్త విడుదల తేదీని నిర్ణీత సమయంలో వెల్లడిస్తాం. మేము #SalaarCeaseFire కోసం తుది మెరుగులు దిద్దుతున్న ఈ సమయంలో మాకు అండగా ఉండండి. మా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు.. సలార్ త్వరలోనే వస్తుంది..”


ఇదీ సలార్ టీమ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్. ఇందులో కొత్త రిలీజ్ డేట్ అప్డేట్ లేదు. కాకపోతే వస్తోన్న విమర్శలు, కమెంట్స్ కు బదులుగా ఒక తాత్కాలికమైన అప్డేట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అప్డేట్ వల్ల ఇక వాళ్లు చెప్పే వరకూ ఆగడమే తప్ప.. చేసేదేం లేదు అని అర్థం చేసుకోవచ్చు.


ఇక ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్, జగపతిబాబు, శ్రుతి హాసన్, మీనాక్షి చౌదరి, టీనూ ఆనంద్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నాడు.

Related Posts