‘హనుమాన్‘ మెగా ఈవెంట్ కి సర్వం సిద్ధం

తక్కువ బడ్జెట్ లో హై స్టాండార్డ్ అవుట్ పుట్ తో రాబోతున్న ‘హనుమాన్‘ మూవీ విజువల్ ట్రీట్ అందించడం ఖాయమనే సంకేతాలైతే వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీకి ఇప్పుడు మెగా సపోర్ట్ కూడా లభించింది.

జనవరి 7న ‘హనుమాన్‘ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడు. విషయమేమిటంటే.. ‘హనుమాన్‘ హీరో తేజ సజ్జ ను బుల్లి చిరంజీవిగా వ్యవహరిస్తుంటారు. తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైందే చిరంజీవి ‘చూడాలని వుంది‘ సినిమాతో. ఆ తర్వాత ‘ఇంద్ర‘ సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా అదరగొట్టాడు. ఆ విధంగా తేజ సజ్జతో మెగాస్టార్ కి అనుబంధం ఉంది. మరోవైపు.. చిరంజీవికి హనుమంతుడిపై అమితమైన భక్తి. అలాంటి హనుమంతుడి కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకి తన సహాయ సహకారాలు అందించడానికి ప్రీ రిలీజ్ వేడుకకు వస్తున్నాడట మెగాస్టార్.

Related Posts