‘గుంటూరు కారం‘ నుంచి మీనాక్షి చౌదరి లుక్

‘గుంటూరు కారం‘ సినిమాలో ఒక కథానాయికగా శ్రీలీల కనిపిస్తే.. మరో నాయికగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. తొలుత పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్స్ గా లాక్ అయ్యారు. పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేసును శ్రీలీల రీప్లేస్ చేస్తే.. శ్రీలీల చేయాల్సిన పాత్రను మీనాక్షి చౌదరికి ఇచ్చారు. అయితే.. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలలో శ్రీలీల తప్పితే.. మీనాక్షి చౌదరి ఎక్కడా కనిపించలేదు. ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

కూర్చుని ఉన్న మహేష్ బాబు భుజాల మీద ప్రేమగా చేతులు వేసిన మీనాక్షి చౌదరి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మీనాక్షి.. మహేష్ బాబుకి మరదలు పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ స్టిల్ ను చూస్తుంటే.. బావమరదలు మధ్య సరసాలను మాటల మాంత్రికుడు సరికొత్తగా ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది. జనవరి 6న రాబోతున్న ట్రైలర్ తో మీనాక్షి రోల్ పై ఫుల్ క్లారిటీ రానుంది.

Related Posts