విక్రమ్ హీరోగా ‘వీర ధీర సూరన్.. పార్ట్-2‘

మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ విక్రమ్ ఒకడు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న ఈ విలక్షణ నటుడు ఇప్పుడు వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్‘ సిరీస్ తర్వాత విక్రమ్ నుంచి ‘ధ్రువ నక్షత్రం‘ విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నా.. ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ తో ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.

మరోవైపు.. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘తంగలాన్‘ కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబైంది. త్వరలోనే.. ‘తంగలాన్‘ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనుంది టీమ్. ఇక.. లేటెస్ట్ గా విక్రమ్ మరో మూవీకి శ్రీకారం చుట్టాడు. అదే.. ‘వీర ధీర సూరన్.. పార్ట్-2‘. అసలు ‘వీర ధీర సూరన్‘ ఫస్ట్ పార్ట్ ఇంకా మొదలవ్వలేదు. ముందుగా సెకండ్ పార్ట్ ను పూర్తిచేసి.. ఆ తర్వాత మొదటి భాగాన్ని మొదలుపెట్టనున్నారట.

తమిళ్ లో పలు విజయవంతమైన సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్ ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకుంది. ఈ మూవీలో దుషారా విజయన్, ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజారమూడు వంటి వారు నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘వీర ధీర సూరన్.. పార్ట్-2‘ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది.

Related Posts