రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్

రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో పార్లమెంట్ కు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా.. హైదరాబాద్ లో పలువురు సినీ సెలబ్రిటీలు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌ వంటి సెలబ్రిటీలు ఓటు వేయనున్నారు. ఇక..
హైదరాబాద్ ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి తమ ఓటు హక్కును వినయోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్ లోని బీ.ఎస్‌.ఎన్‌.ఎల్‌ సెంటర్‌ వద్ద అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ ఓటు వేయనున్నారు. ఇక.. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ వంటి సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

హైదరాబాద్ ఎఫ్‌.ఎన్‌.సీ.సీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌, విశ్వక్‌సేన్‌, దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు తమ ఓటు వేయబోతుండగా.. జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ లో రవితేజ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నాడు. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఓటు హక్కు వినయోగించుకోనున్నారు.

మణికొండ హైస్కూల్ లో వెంకటేష్, బ్రహ్మానందం.. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి దంపతులు, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనిలో హీరో రామ్ పోతినేని, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని, దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు, రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ లోని ఆర్థిక సహకార సంస్థ వద్ద అల్లరి నరేశ్‌, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి తమ ఓటు వేయబోతున్నారు.

Related Posts