పోస్టర్స్ తోనే అంచనాలు పెంచేసిన గోపీచంద్

హీరో అనే పదానికి అసలు సిసలు నిర్వచనంలా ఉండే కథానాయకుల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. మంచి సబ్జెక్ట్ పడాలే కానీ.. ఆన్ స్క్రీన్ పై తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో చెలరేగిపోతుంటాడు గోపీచంద్. ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ మ్యాచో స్టార్.. త్వరలో ‘భీమా‘ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎ.హర్ష డైరెక్షన్ లో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి టీజర్ రాబోతుంది.

జనవరి 5న మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాలకు ‘భీమా‘ మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో భీమా గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు గోపీచంద్. ఇక.. టీజర్ రిలీజవుతోన్న సందర్భంగా ‘భీమా‘ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. పోలీస్ యూనిఫామ్ లో గోపీచంద్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. మరి.. టీజర్ రిలీజ్ తర్వాత ‘భీమా‘పై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా ఏ రేంజులో పెరుగుతాయో చూడాలి.

Related Posts