కొత్త జానర్ పై గురిపెట్టిన బన్నీ-త్రివిక్రమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. ఈసారి డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ నాల్గవసారి కలిసి పనిచేయబోతున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. కానీ.. బన్నీ, త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి దాదాపు రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉందట.

ఇప్పటివరకూ వీరిద్దరూ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ అందించారు. అయితే.. ఈసారి మాత్రం ఓ భారీ సోషియో ఫాంటసీ మూవీతో రాబోతున్నారు. అందుకే.. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పట్టనుందట. ఈ విషయాన్ని లేటెస్ట్ గా నిర్మాత బన్నీ వాసు తెలిపాడు. అంటే.. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ.. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ వెంటనే తమ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో.. ‘పుష్ప 2’ తర్వాత బన్నీతో బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Related Posts