టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణుకి బర్త్ డే విషెస్

తెలుగులో డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసే హీరోలు తక్కువ. ఆ తక్కువలోనూ కాస్త ఎక్కువ వైవిధ్యమైన సినిమాలు చేసే హీరో శ్రీవిష్ణు. చిన్న పాత్రలతో పరిచయం అయి సెకండ్ హీరోగా ఎదిగి ఇప్పుడు హీరోగా కంటెంట్ బేస్డ్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. అందుకే శ్రీవిష్ణు నుంచి ఓ సినిమా వస్తోందంటే.. ఓ మంచి కంటెంట్ తో వస్తున్నాడనే భావిస్తారు ప్రేక్షకులు. ఇవాళ (ఫిబ్రవరి 29) శ్రీవిష్ణు పుట్టినరోజు.

తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాడు శ్రీవిష్ణు. బాగా చదువుకున్నాడు. కొన్నాళ్లు వెబ్ డిజైనర్ గానూ పనిచేశాడు. సినిమాలపై ముందు నుంచీ ఆసక్తి ఉన్నా.. నారా రోహిత్ తో పరిచయం అతని కలకు దగ్గర చేసింది. అప్పట్లో నారా రోహిత్ కూడా డిఫరెంట్ మూవీస్ చేసేవాడు కదా.. ఆ స్టోరీ సెలెక్షన్ లో శ్రీ విష్ణు హస్తం కూడా ఉండేదని వాళ్లే చెప్పుకున్నారు. దీనికంటే ముందు ‘ప్రేమ ఇష్క్ కాదల్‘ అనే సినిమాలో ఓ హీరోగా నటించిన తర్వాత శ్రీవిష్ణుకు సొంత గుర్తింపు మొదలైంది.

రోహిత్ నటించిన ‘ప్రతినిధి‘లో ఓ పాత్రతో ఆకట్టుకన్నాడు. అలాగే త్రివిక్రమ్ మూవీ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి‘లో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కనిపించాడు. అయితే శ్రీవిష్ణులోని సిసలైన నటుడిని చూపించిన సినిమా మాత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు‘. నారా రోహిత్ కూడా నటించిన ఈ చిత్రంలో రైల్వే రాజుగా శ్రీవిష్ణు నటన అద్భుతం అనేశార జనం. మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ తో శ్రీవిష్ణుకు ప్రేక్షకుల్లో అభిమాన గణం స్టార్ట్ అయింది.

‘మా అబ్బాయి, ఉన్నది ఒకటే జిందగీ‘ చిత్రాలు విష్ణుకు ఎలాంటి ప్లస్ కాలేదు. కానీ కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసిన ‘మెంటల్ మదిలో‘ మరో మంచి హిట్ గా నిలిచింది. ఆ వెంటనే వచ్చిన ‘నీదీనాదీ ఒకే కథతో‘ మరో హిట్ అందుకుని.. శ్రీవిష్ణు స్టోరీ సెలక్షన్ వేరే ఉంటుందని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలోనూ అతని నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
మరోసారి వివేక్ ఆత్రేయతో చేసిన ‘బ్రోచెవారెవరురా‘ సూపర్ హిట్.

విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటాడు శ్రీవిష్ణు. గత ఏడాది ‘సామజవరగమణ‘ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ‘సామజవరగమణ‘ తర్వాత మరోసారి ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచడానికి ‘ఓం భీమ్‌ బుష్‌’ అనే ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈరోజు శ్రీవిష్ణు బర్త్ డే స్పెషల్ గా మరో కొత్త సినిమా ‘స్వాగ్‘ను ప్రకటించాడు. గతంలో శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర‘ సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి ‘స్వాగ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవిష్ణు బర్త్ డే స్పెషల్ గా ‘స్వాగ్‘ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అడవిలో జంతువులు అన్నీ మాట్లాడుకున్నట్టు, కథలు చెప్పినట్టు వాటికి సునీల్, గంగవ్వ.. వాయిస్ లు పెట్టి నవ్విస్తూ ‘స్వాగ్’ టైటిల్ ని ప్రకటించారు. చివర్లో ఈ కథ మగవాడిది, శ్వాగణిక వంశానిది అని శ్రీవిష్ణు వాయిస్ తో అనౌన్స్ చేశారు.

Related Posts