బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. తమిళ్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంటే భారీ క్రేజ్ ఉంది. అందుకే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కేవలం ఇండియాలోనే ఏకంగా 10లక్షల టికెట్స్ కు పైగా అమ్ముడైపోయాయి. ఇలా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాకూ జరిగింది. ఒకే యేడాది ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ హీరోగానూ షారుఖ్ నిలిచాడు.

జవాన్ సినిమా ట్రైలర్ కే చాలామందికి మతిపోయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా.. అది కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తోంది. అట్లీ ఇంతకు ముందు మాస్ మూవీస్ చేసినా ఇది మరీ ఊరమాస్ అనేలా ఉంది. షారుఖ్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇది తన ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడం విశేషం.

కావడానికి బాలీవుడ్ మూవీనే అయినా ఇది పూర్తిగా సౌత్ ఫ్లేవర్ తో కనిపిస్తోన్న సినిమా. దర్శకుడు, హీరోయిన్, విలన్ విజయ్ సేతుపతి, మ్యూజిక్ డైరెక్టర్ తో సహా అంతా తమిళ్ వారే. అందుకే ఈ మూవీని సౌత్ వాళ్లు కూడా ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారు.ఈ కారణంగా రికార్డ్ స్థాయిలో 10లక్షల టికెట్స్ అమ్ముడు పోయాయి. విశేషం ఏంటంటే.. బాలీవుడ్ కు మూవీస్ కు ముందు నుంచీ నైజాంలో మంచి ఆదరణ ఉంటుంది. బట్ ఈ సారి నైజాంతో పాటు సీడెడ్, ఉత్తరాంధ్రలో కూడా ఓ రేంజ్ లో బుకింగ్స్ అవుతున్నాయి. ఇది ట్రేడ్ ను కూడా ఆశ్చర్యపరుస్తోంది. దీంతో జవాన్ తెలుగులో కూడా జైలర్ లాగా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే జవాన్ పఠాన్ కలెక్షన్స్ ను దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. దేశభక్తి, అవినీతి, మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలను కూడా టచ్ చేస్తూ సాగింది అనే టాక్ ఉంది. అంటే బలమైన కంటెంట్ కు ఇలాంటి యాక్షన్ డోస్ యాడ్ అయితే రికార్డులు బద్ధలు కావడం కన్ఫార్మ్ కదా.. ? ఇప్పటికైతే జవాన్ పై దేశవ్యాప్తంగా పూర్తిగా పాజిటివ్ బజ్ ఉంది. ఏ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇప్పటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులు కనుమరుగు అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.