డిసెంబర్ రెండో వారంలో వచ్చేవి ఆ రెండేనా?

డిసెంబర్ రెండో వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. అవే.. నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాల్లో నాని, నితిన్ చిత్రాలు తప్పితే.. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ సినిమాల ప్రచారంలో ఎలాంటి కదలిక లేదు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న దాన్ని బట్టి విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ డిసెంబర్ 8 నుంచి తప్పుకునే అవకాశాలున్నాయట.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్ ఇంకా పది రోజులు బ్యాలెన్స్ ఉందట. ఇటీవల షూటింగ్ లో విశ్వక్ సేన్ కి గాయం కావడం వలన కూడా ఈ షూటింగ్ లేటయినట్టు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని వచ్చే యేడాది మార్చిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాత నాగవంశీ. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదేగానీ జరిగితే డిసెంబర్ రెండో వారంలో నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘ మధ్యే పోటీ ఉండబోతుంది.

Related Posts