అల్లు అర్జున్ చెన్నై వెళ్లింది అందుకా..

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు. అయితే ఇతర హీరోలతో పోలిస్తే కాస్త స్లోగా వెళుతున్నాడు. అయితే ప్రతిసారీ ఏదో ఒక దర్శకుడి పేరు తెరపైకి వస్తుండటం.. వారితో ఆయన సినిమాలు చేస్తున్నాడంటూ న్యూస్ రావడం కూడా కామన్ అయిపోయింది. ఆల్రెడీ పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అనౌన్స్ అయి ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇప్పటి వరకూ తమ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఈ సారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తారు అనే టాక్ ఉంది. ఇక ఈ సినిమా గురించి ఏమీ తేలకుండానే.. అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నాడనే న్యూస్ హల్చల్ చేస్తున్నాయి. ఈ మేరకు అట్లీ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. లేటెస్ట్ గా జైలర్ ఫేమ్ నెల్సన్ పేరు వినిపించింది. ఈ రెండు విషయాలూ కన్ఫార్మ్ చేసుకోవడానికే అల్లు అర్జున్ చెన్నై వెళ్లాడు అనేది లేటెస్ట్ టాక్.


మామూలుగా అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ దగ్గరకే దర్శకులు వచ్చి కథలు చెబుతారు. బట్ ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టుగా ఆయనే దర్శకుల వద్దకు వెళ్లాడు అనేది లేటెస్ట్ న్యూస్. యస్.. ఈ శుక్రవారం ఉదయం ఐకన్ స్టార్ సడెన్ గా చెన్నై వెళ్లాడు. అఫ్‌ కోర్స్ అతను అది ముందే ప్లాన్ చేసుకుని ఉంటాడు.ఈ చెన్నై ట్రిప్ ప్రధానంగా అట్లీ కోసమే అంటున్నారు. అతని కథ వినేందుకు అల్లు అర్జునే స్వయంగా వెళ్లాడట. పనిలో పనిగా నెల్సన్ తో కూడా మీట్ అయ్యాడు అంటున్నారు. కానీ ఈ విషయం కచ్చితంగా తెలియదు. అయితే అట్లీని మీట్ అయ్యాడు అనేది బలంగా వినిపిస్తోంది. మరి ఈ మీటింగ్ సక్సెస్ అయితే.. ఖచ్చితంగా ఈ కాంబోలో సినిమా వస్తుంది. లేదంటే ఎప్పట్లానే త్రివిక్రమ్ సినిమా కంటిన్యూ అవుతుంది.


మరో విషయం ఏంటంటే.. కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నాడు అల్లు అర్జున్. అందుకు కారణం.. కథల ఎంపికలో ఖచ్చితంగా ఉండటమే అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. నిజానికి అల వైకుంఠపురములో కథలో పెద్దగా విషయం ఉండదు. అయినా అతను అంచనా వేశాడు. అదే అతనికి అప్పటికి కెరీర్ బెస్ట్ హిట్ అయింది. ఏదేమైనా అల్లు అర్జున్ ను కథల విషయంలో ఒప్పించడం అంత సులువు కాదు అనేది అందరూ చెబుతున్న విషయం.

Related Posts