గీతాంజలి మళ్లీ వస్తోంది..

2014లో వచ్చిన గీతాంజలి సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇదే టైటిల్ తో 1989లో నాగార్జున – మణిరత్నం కాంబోలో వచ్చిన క్లాసికల్ మూవీ పేరును చెడగొడుతుందా అనుకున్నారంతా. కానీ నిలబెట్టింది. రాజ్ కిరణ్ డైరెక్షన్ లో అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్‌, రావు రమేష్‌, షకలక శంకర్, మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కు మంచి అప్లాజ్ కూడా వచ్చింది. కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే కూడా చాలా ప్లస్ అయింది. అయితే అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అది ఇన్నాళ్లకు సెట్ అయింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ప్రారంభం అయింది. ఇవాళే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.


ఇక ఈ సెకండ్ పార్ట్ కు దర్శకుడు మారినట్టు కనిపిస్తోంది. మిగతా టీమ్ అంతా ఉన్నారు. అంజలి, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ తో పాటు కోన వెంకట్ ఈ సారి స్క్రీన్ ప్లేతో పాటు సమర్పకుడుగా కూడా ఈ సీక్వెల్ లో పార్ట్ అయ్యి ఉన్నాడు. ఎమ్.వి.వి సినిమా బ్యానర్ నిర్మిస్తోంది. జి.వి దర్శకత్వం చేస్తున్నాడు. మెయిన్ టీమ్ అంతా పాల్గొనగా ముహూర్తం షాట్ తీసి షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈ సారి ఏ తరహాలో నవ్విస్తూ భయపెడతారో కానీ.. సీక్వెల్ టైటిల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అని పెట్టారు.

Related Posts