‘హాయ్ నాన్న‘ నుంచి ‘అమ్మాడి‘ గీతం

నాని ‘హాయ్ నాన్న‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. డిసెంబర్ 7న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు ‘అమ్మాడి‘ అంటూ సాగే మూడో గీతం విడుదలైంది. టాలీవుడ్ లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ హేషబ్ అబ్దుల్ వహబ్ సంగీతాన్ని సమకూర్చిన ‘అమ్మాడి‘ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

కృష్ణకాంత్ రచన చేసిన ఈ పాటను కాలభైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తమ మూడో యానివర్శరీ సందర్భంగా భర్తకి డెడికేట్ చేస్తూ ఆలపించిన గీతంగా ఈ పాట మొదలైంది. ఈ పాటలో హీరోహీరోయిన్స్ నాని, మృణాల్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. ‘సీతారామం‘ తర్వాత తెలుగులో మృణాల్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాలోనూ కొన్ని సన్నివేశాల్లో చీరకట్టులో అదరగొట్టబోతుంది మృణాల్. ఇక.. ‘దసరా‘ వంటి ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ తర్వాత నాని నుంచి వస్తోన్న క్లాస్ మూవీ ఇది.

‘అమ్మాడి‘ పాట విడుదల తర్వాత ‘హాయ్ నాన్న‘ సినిమాలో మృణాల్ ఠాకూర్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో టీజర్ విడుదలైనప్పుడు నానికి, మృణాల్ కి అస్సలు సంబంధమే లేనట్టు చూపించారు. ఆల్రెడీ పెళ్లి సెట్ అయిన అమ్మాయి మృణాల్.. ఒక బిడ్డకు తండ్రైన నానిని ప్రేమించినట్టు చూపించారు. కానీ.. ఈ అమ్మాడి గీతంలో పెళ్లై.. తమ మూడో యానివర్శరీ సందర్భంగా ఈ గీతం వచ్చినట్టు ఉంది. ఇక.. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డా.విజేందర్ రెడ్డి తీగల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శౌర్యువ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా, జయరాం, ప్రియదర్శి ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.

Related Posts