డ్యాన్సుల్లో దుమ్మురేపిన సుమ కొడుకు

సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్ గమ్‘. ఈ సినిమాలో మానస చౌదరి కథానాయిక. ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీస్ ఫేమ్ రవికాంత్ పేరెపు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ‘బబుల్ గమ్‘ మూవీ నుంచి ఆమధ్య టీజర్ రిలీజయ్యింది. యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందిన ఈ మూవీ టీజర్ కి మంచి అప్లాజ్ వచ్చింది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘హబీబీ జిలేబీ‘ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ 1.5 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఈ పాటలో హీరో రోషన్ డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి. తన స్టెప్పుల్లో ఈజ్ ను ప్రదర్శిస్తున్నాడు రోషన్. పూర్ బాయ్ రిచ్ గాళ్ కైండ్ ఆఫ్ స్టోరీ తో వస్తోన్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts