‘దేవర’కి గట్టి పోటీ ఇవ్వబోతున్న ‘ది గోట్ లైఫ్’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర.. పార్ట్ 1’ వచ్చే యేడాది ఏప్రిల్ 5న విడుదలకు ముస్తాబవుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే.. ‘దేవర’ వస్తోన్న ఐదు రోజులకే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ నటిస్తున్న ‘ది గోట్ లైఫ్’. ఏప్రిల్ 10న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా ‘ది గోట్ లైఫ్’ తెరకెక్కుతోంది. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా ఇదే. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందిస్తున్నారు.

ఈ మూవీలో పృథ్వీరాజ్ మేకోవర్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయనుందట. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related Posts