‘యానిమల్’ రికార్డ్స్ కొల్లగొడుతోందా?

మరికొద్ది గంటల్లో ‘యానిమల్’ థియేట్రికల్ హంగామా మొదలవ్వబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరహో అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘యానిమల్’ క్రేజ్ మామూలుగా లేదు. హైదరాబాద్ లో తొలిరోజు 550కి పైగా షోలు పడనున్నాయి. వీటిలో ఇప్పటికే 400 షోల వరకూ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో సిటీస్ లోనూ ‘యానిమల్’ క్రేజ్ మామూలుగా లేదు.

మరోవైపు ఓవర్సీస్ లోనూ ‘యానిమల్’ హంగామా భారీగానే కనిపిస్తుంది. మొత్తంగా.. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ‘యానిమల్’ ఓ సెన్సేషన్ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది బాలీవుడ్ కి మంచి విజయాలు దక్కాయి. షారుక్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యేసి కోట్లు కొల్లగొట్టాయి. బెనిఫిట్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ వస్తే.. ‘యానిమల్’కి కూడా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేసే సత్తా ఉంది.

Related Posts