ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో ప్రభాస్.. సెప్టెంబర్ నుంచి ‘స్పిరిట్’

తమ అభిమాన హీరోలు ఎన్ని పాత్రలు చేసినా.. ఒక్క పోలీస్ గెటప్పే ఫ్యాన్స్ కు ఎక్కువ కిక్ ఇస్తుంది. హీరోలు సైతం ఆన్ స్క్రీన్ పై పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించాలని తహతహలాడుతుంటారు. ఒక్కసారైనా ఖాకీ చొక్కా వేసుకుని సిల్వర్ స్క్రీన్ పై షైన్ అవ్వాలని తాపత్రయపడతారు. టాలీవుడ్ లో చాలామంది హీరోలు పోలీస్ పాత్రలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో పవర్ చూపించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్.

తన కాంటెంపరరీ హీరోలైన పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఇలా.. అందరూ పోలీస్ డ్రెస్ లో తమ పవర్ చూపించారు. కానీ.. ఇప్పటివరకూ ప్రభాస్ కి మాత్రం ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు అది సందీప్ రెడ్డి వంగా సినిమాతో నెరవేరబోతుంది. ప్రభాస్ తో సందీప్ తెరకెక్కించే ‘స్పిరిట్’లో పవర్ ఫుల్ పోలీస్ గా కనువిందు చేయనున్నాడు. ‘యానిమల్’ రిలీజ్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా వరుస ఇంటర్యూలు ఇస్తున్నాడు. ఈకోవలోనే ‘స్పిరిట్’ గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు. ఈ సినిమాని వచ్చే యేడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి.. 2025 క్రిస్మస్ లేదా 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. మొత్తంమీద.. బాహుబలి ప్రభాస్ కటౌట్ కి పోలీస్ డ్రెస్ పెర్ఫెక్ట్ గా సూటవుతుంది. మరి.. కాప్ రోల్ లో పాన్ ఇండియా స్టార్ ఏ రీతిన కనిపిస్తాడో చూడాలి.

Related Posts