తమ్మారెడ్డి భరద్వాజ బాధేంటీ..?

సీనియర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇవాళ్టి టిఎఫ్ సిసి ఎన్నికల సరళిని చూసి కొన్ని హాట్ కమెంట్స్ చేశాడు. ఆయన కమెంట్స్ చూస్తే ఇండస్ట్రీలో జరగరానిది ఏదోజరగబోతోన్నట్టుగా కనిపిస్తోందంటున్నారు కొంతమంది. నిజానికి చాంబర్ కు ఆయన కూడా అధ్యక్షుడుగా పనిచేశాడు. ఆ కాలం వేరు. అప్పట్లో నిర్మాతలకు విలువ ఉండేది.నిర్మాతలంటే గౌరవం కూడా ఉండేది. కానీ ఇప్పుడు అతను జస్ట్ క్యాషియర్ అయిపోయాడు.

అలాంటప్పుడు ఇలాంటివి జరగడం కామన్ కదా. అయినా ఎందుకు ఆయన అలా బాధపడిపోతున్నాడు అనేది చాలామంది చెబుతున్న మాట. పైగా యాక్టివ్ గా లేని ప్రొడ్యూసర్స్ చాంబర్ ను శాసిస్తాం అంటే యాక్టివ్ గా ఉన్నవాళ్లు ఖచ్చితంగా రివర్స్ అవుతారు. అలాంటప్పుడే కదా ఎన్నికలు అనే మాట వచ్చేది. మరి ఇంతకీ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కమెంట్స్ ఏంటో తెలుసా.. ?


“ఇవాళ ఎలెక్షన్స్ చూస్తుంటే సంతోషించాలో ఏడవాలో తెలియట్లేదు. చాల ఎలెక్షన్స్ చూశాను… ప్రెసిడెంట్ గా కూడా గెలిచాను. కానీ బైట ,లోపల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగింది అని సంతోసహాపడాలా ? లేక జనరల్ ఎలెక్షన్స్ లాగా ఉందని సిగ్గు పడాలో తెలియట్లేదు. దేనికి పోటీ పడుతున్నారో , ఎందుకు కొట్టుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఛాంబర్ లో చాలా సంవత్సరాలు పని చేశాను, మా నాన్న పనిచేసాడు ఛాంబర్ అనేది అన్ని సెక్టర్స్ కి మంచి చేయటానికి వుంది..ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది ఇలాంటివి భవిష్యత్తు లో జరగకూడదు అని కోరుకుంటున్నా..”


ఇవీ భరద్వాజ చేసిన కమెంట్స్. ఇవి చూస్తే ఎవరికైనా ఈ ఎన్నికలు ఎవరికి వారు ఎంత ప్రిస్టీజియస్ గా తీసుకున్నారో.. ఎంత పోటా పోటీగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్నికలు అంటేనే పోటీ కదా. అయితే ఈ పోటీ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగడం లేదు అనేది తమ్మారెడ్డి బాధ.

Related Posts