Reviews

ఛాంగురే బంగారు రాజా

తారాగణం : కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, నిత్య, అజయ్, రవిబాబు, రాజ్ తిరందాస్, ఎస్తేర్ నోరా
ఎడిటర్ : కార్తీక్ వున్నవ
సంగీతం : కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ : మెహర్ బాబా, అజ్జు
నిర్మాత : రవితేజ
దర్శకత్వం : సతీష్ వర్మ

సెప్టెంబర్ 15న రావాల్సిన స్కంద, చంద్రముఖి2 రెండు సినిమాలూ సడెన్ గా 28కి వాయిదా పడ్డాయి. దీంతో చిన్న సినిమాలు ఆ డేట్స్ ను ఆక్యు పై చేసేందుకు హడావిడీగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి. ఛాంగురే బంగారు రాజా కూడా అలా వచ్చిందే. మాస్ మహరాజా రవితేజ నిర్మించిన సినిమా కావడంతో తక్కువ టైమ్ లోనే మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ ను కలెక్షన్స్ గా మార్చుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :
నర్సీపట్నం దగ్గర దుగ్గాడ అనే ఊళ్లో ఉండే బంగార్రాజు (కార్తీక్ రత్నం) ఒక మెకానిక్. బాగా సెల్ఫిష్. సొంత వూరివారి దగ్గర కూడా ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తాడు. ఆఖరికి పోలీస్ ల వద్ద కూడా అంతే. అదే స్టేషన్ లో ఉండే లేడీ కానిస్టేబుల్ ను లవ్ చేస్తుంటాడు కూడా. ఇతని తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి చనిపోయేముందు ఊళ్లో పొలాన్ని, విలువను కాపాడుకోమని చెబుతుంది. ఈ ఊరిలో వర్షం వస్తే పొలాల్లో రంగురాళ్లు బయటపడుతుంటాయి. వాటి కోసం వానాకాలంలో ఊరంతా ప్రయత్నాలు చేస్తుంది. ఒక రోజు రాళ్ల కోసం వెదుకుతుండగా బంగార్రాజుకు దొరికిన రత్నాన్ని అక్రమంగా లాక్కుంటాడు సోమునాయుడు(రాజ్ తిరందాస్). అతన్ని చంపేస్తా అని అందరి ముందూ అంటాడు. కట్ చేస్తే తర్వాతి రోజే సోమునాయుడు శవమై పడి ఉంటాడు. అతన్ని బంగార్రాజే చంపాడు అని ఊరోళ్లు చెబితే పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. బెయిల్ పై బయటికి వచ్చిన బంగార్రాజు తను హత్య చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నంలో అసలు ఆ చంపబడిన వ్యక్తి ప్లేస్ లో తనే ఉండాలి అని తెలుసుకుని షాక్ అవుతాడు. తనను చంపాలనుకున్న వ్యక్తి ఎవరు..? ఎందుకు..? తన ప్రేమకథ ఏమైంది..? హంతకుడి గురించి తెలుసుకునే క్రమంలో తన స్నేహితుడు తాతారావు(సత్య) పాత్రేంటీ అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందనుకుంటాం. ఈ ఛాంగురే బంగార్రాజా కూడా అలాంటి ఫీలింగ్ నే ఇచ్చింది. కాకపోతే ఈ తరహా ఎంటర్టైన్మెంట్స్ 80, 90ల కాలంలోనే వెండితెరపై చాలా అంటే చాలానే వచ్చాయి. ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు వంటి దర్శకులు ఇలాంటి సినిమాలు అనేకం చేశారు. అందులో ఏ మార్పూ లేకుండా కేవలం సెల్ ఫోన్ వంటి అప్డేటెడ్ పరికరంతో అదే కథ, కథనాలతో వచ్చిందీ చిత్రం. అలాగని బోరింగ్ మూవీ కాదు. అక్కడక్కడా నవ్విస్తుంది. ముఖ్యంగా సత్య కామెడీ, లవ్ ట్రాక్ బాగా పేలింది. అయితే ఇలాంటి మర్డర్ మిస్టరీ కామెడీ డ్రామాల్లో ఉండాల్సినంత బిగి లేదు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ విలన్ ఎంట్రీతో పూర్తిగా నీరసం ఆవహిస్తుంది. మతిమరపులు హంతకుడు అనే కోణం అస్సలు సూట్ కాలేదు. పైగా హారన్ సౌండ్ వినిపిస్తే అంతా మర్చిపోయే విలన్ అంటే సిల్లీగా కాదు.. చీప్ గా ఉంది. ఆ పాత్ర చేసింది రవిబాబు. రవిబాబు ఇలాంటి తింగరి పాత్రలు గతంలోనూ చేసినా.. ఎందుకో ఇది మరీ అతని స్థాయిని దిగజార్చినట్టుగా ఉంది. సెకండ్ హాఫ్ లో ఎక్కడా లాజిక్ కనిపించదు. హంతకుడి కోసం పోలీస్ లు మినిమం కూడా ప్రయత్నించరు. ఎలా చూసినా కంప్లీట్ గా అవుట్ డేటెడె స్టోరీ, స్క్రీన్ ప్లేతోనే కనిపిస్తుందీ సినిమా. రంగురాళ్ల నేపథ్యంలో హీరోను ఎందుకు చంపాలనుకుంటున్నారనేది ఎవరైనా సింపుల్ గానే ఊహించేయొచ్చు. మొత్తంగా టైటిల్ లో ఉన్నంత ఉత్సాహం కథ, కథనాల్లో లేదు.


ఇక ఈ సినిమాను ఒక హత్యను ముగ్గురి కోణంలో చూపించేలా.. జపనీస్ లెజెండరీ దర్శకుడు అకిరా కురసోవా రషోమాన్ రేంజ్ లో ఓపెన్ చేశాడు దర్శకుడు. బట్ అందులో పాయింట్ ఒన్ పర్సెంట్ కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఇంత వీక్ స్టోరీని రవితేజ ఎలా యాక్సెప్ట్ చేశాడు అనేదేం పెద్ద పాయింట్ కాదు. ఎందుకంటే ఇంత వీక్ స్టోరీలోనూ కొన్ని నవ్వులు ఉన్నాయి. అవి మాత్రమే మాస్ రాజాకు వినిపించాడేమో అనిపిస్తే తప్పేం కాదు.


నటన పరంగా కార్తీక్ రత్నం టాలెంటెడ్. కానీ అతని టాలెంట్ కు తగ్గ పాత్ర కాదు. అయినా తనే నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఓ రకంగా సక్సెస్ ఫుల్ లవ్ ట్రాక్ తో రెండో హీరోలా నిలిచాడు సత్య. నిత్యతో అతని లవ్ ట్రాక్ హిలేరియస్ గా వర్కవుట్ అయింది. హీరోయిన్ ఉందా అంటే ఉంది. కానీ తను జూనియర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు తక్కువ. ఇంతకంటే బెటర్ స్టోరీస్ తను యూ ట్యూబ్ లోనే చేసింది. ఇతర పాత్రల్లో అజయ్, రవిబాబువి వెరీ రొటీన్ రోల్స్. వాళ్లే చాలాసార్లు ఇలాంటి పాత్రలు చేసి ఉన్నారు. మిగతా వారి గురించి అనవసరం.

టెక్నికల్ గా మ్యూజిక్ జస్ట్ ఓకే. నేపథ్య సంగీతం బానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. విలేజ్ బ్యూటీస్ ను బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ లో కామెడీ సీన్స్ పేలాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా సతీష్ వర్మ 90ల కాలాన్ని దాటలేదు. ఇంతకు మించి ఆయన గురించి చెప్పడానికేం లేదు.

ఫైనల్ గా : అవుట్ డేటెడ్ రాజా
రేటింగ్ : 2/5

                                                                        - బాబురావు. కామళ్ల
Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

10 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

11 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

11 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

11 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

17 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

17 hours ago