ఛాంగురే బంగారు రాజా

తారాగణం : కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, నిత్య, అజయ్, రవిబాబు, రాజ్ తిరందాస్, ఎస్తేర్ నోరా
ఎడిటర్ : కార్తీక్ వున్నవ
సంగీతం : కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ : మెహర్ బాబా, అజ్జు
నిర్మాత : రవితేజ
దర్శకత్వం : సతీష్ వర్మ

సెప్టెంబర్ 15న రావాల్సిన స్కంద, చంద్రముఖి2 రెండు సినిమాలూ సడెన్ గా 28కి వాయిదా పడ్డాయి. దీంతో చిన్న సినిమాలు ఆ డేట్స్ ను ఆక్యు పై చేసేందుకు హడావిడీగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి. ఛాంగురే బంగారు రాజా కూడా అలా వచ్చిందే. మాస్ మహరాజా రవితేజ నిర్మించిన సినిమా కావడంతో తక్కువ టైమ్ లోనే మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ ను కలెక్షన్స్ గా మార్చుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :
నర్సీపట్నం దగ్గర దుగ్గాడ అనే ఊళ్లో ఉండే బంగార్రాజు (కార్తీక్ రత్నం) ఒక మెకానిక్. బాగా సెల్ఫిష్. సొంత వూరివారి దగ్గర కూడా ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తాడు. ఆఖరికి పోలీస్ ల వద్ద కూడా అంతే. అదే స్టేషన్ లో ఉండే లేడీ కానిస్టేబుల్ ను లవ్ చేస్తుంటాడు కూడా. ఇతని తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. తల్లి చనిపోయేముందు ఊళ్లో పొలాన్ని, విలువను కాపాడుకోమని చెబుతుంది. ఈ ఊరిలో వర్షం వస్తే పొలాల్లో రంగురాళ్లు బయటపడుతుంటాయి. వాటి కోసం వానాకాలంలో ఊరంతా ప్రయత్నాలు చేస్తుంది. ఒక రోజు రాళ్ల కోసం వెదుకుతుండగా బంగార్రాజుకు దొరికిన రత్నాన్ని అక్రమంగా లాక్కుంటాడు సోమునాయుడు(రాజ్ తిరందాస్). అతన్ని చంపేస్తా అని అందరి ముందూ అంటాడు. కట్ చేస్తే తర్వాతి రోజే సోమునాయుడు శవమై పడి ఉంటాడు. అతన్ని బంగార్రాజే చంపాడు అని ఊరోళ్లు చెబితే పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. బెయిల్ పై �