అవును.. అతడు ప్రభాస్ ను మళ్లీ ఢీ కొంటున్నాడు

ప్రభాస్ ను ఢీ కొట్టాలంటే పెద్ద స్టార్సే ఆలోచిస్తున్న టైమ్ ఇది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలూ పోయినా..అతని ఇమేజ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.అలాంటి ప్రభాస్ ను లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టి విజేతగా నిలిచాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

2022 మార్చి 11న ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు వచ్చిన అతని కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రాధేశ్యామ్ పోయింది.ఆ ఉత్సాహంతో మరోసారి ప్రభాస్ సినిమాతో ఢీ కొట్టబోతున్నాడు వివేక్ అని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య వాటిని ఖండించాడు వివేక్ అగ్నిహోత్రి. బట్ అవి కేవలం ఖండనలకే పరిమితం అయింది. అతను మరోసారి ప్రభాస్ తో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమయ్యాడు.


సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ విడుదల కాబోతోంది. అదే రోజు తన వాక్సిన్ వార్ ను దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నాడు వివేక్. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అంటే సలార్ తో తనకు వచ్చిన సమస్య ఏం లేదు అనుకుంటున్నాడా లేక.. నిజంగానే సలార్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా అనేది చెప్పలేం కానీ.. ఈ వ్యాక్సిన్ వార్ ను హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల, బెంగాలీ, గుజరాతీ, భోజ్ పురీ, పంజాబీ, మరాఠీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈ సారి అతను గెలుస్తాడా లేక ప్రభాస్ గెలుస్తాడా అనేది చెప్పలేం కానీ.. ఒక వర్గం ఆడియన్స్ నుంచి మాత్రం ప్రభాస్ సినిమాక సమస్య తప్పదు అనుకోవచ్చు.

Related Posts