పవన్ కళ్యాణ్ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు

అవుట్ డేటెడ్ అని ఎప్పుడో అనిపించుకున్నా.. కంటిన్యూస్ గా సినిమాలు రూపొందిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. హిట్ అనే మాట విని అతనికి ఏళ్లవుతుంది. అయినా ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఒక పార్టీకి అనుకూలంగా ఉండేలా వ్యూహం అనే సినిమా రూపొందించాడు. ఆ మధ్య విడుదలైన వ్యూహం టీజర్ పొలిటికల్ గా సంచలనం సృష్టించింది.

https://youtu.be/rr7rlsCGDxk

అప్పుడు కేవలం జగన్ మోహన్ రెడ్డి పాత్రనే ఎక్కువగా హైలెట్ చేశాడు.ఇక ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మరో టీజర్ విడుదల చేశాడు. ఈ సారి పూర్తిగా చంద్రబాబు నాయుడు టార్గెట్ గానే ఈ టీజర్ కనిపిస్తోంది. అలాగే అనేక అంశాలను కూడా ఈ సినిమా చూపించబోతున్నాను అనేలా ఆయా సంఘటనలకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో మొదలైందీ టీజర్.అప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న చిరంజీవితో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్నట్టుగా ఉన్న విజువల్స్ తో పాటు సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యల పాత్రలూ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చిరంజీవితో విభేదించి చంద్రబాబుతో జట్టు కట్టినట్టుగానూ చూపించాడు.

టీజర్ చివర్లో చెప్పిన డైలాగ్ మాత్రం ఖచ్చితంగా టిడిపి, జనసేనకు గట్టిగా తగిలేలా ఉంది. ఒక పాత్రధారి చంద్రబాబుతో .. ” ఎప్పుడో ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ కు కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా.. ” అంటాడు. దానికి చంద్రబాబు.. ” వాడికంత సీన్ లేదు. తనను తానే వెన్ను పోటు పొడుచుకుంటాడు.. ” అని బదులిచ్చే ఈ డైలాగ్.. కొంత వరకూ అభ్యంతరకమే అని చెప్పాలి. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటున్నాడు. మరి ఈ సినిమాను విడుదల కానిస్తారా అనేది డౌటే కానీ.. ఈ టీజర్ చూస్తే సినిమా మొత్తం జగన్ కు అనుకూలంగా టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

Related Posts