పాపం ప్రభాస్ కే ఎందుకిలా..

బాహుబలితో ఓ తెలుగువాడిగా ఓవర్ నైట్ ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఆ మూవీ అతనికి ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. ఆ తర్వాత వచ్చిన సాహో సౌత్ లో పెద్దగా ఆడలేదు కానీ.. నార్త్ లో దుమ్మురేపింది. నిజానికి ఇప్పుడు చూస్తే ఈ మూవీ యాక్షన్ సీన్స్ కు ఫిదా అయిపోతాం. ఈ తరహా సీన్స్ అంతే నార్త్ వాళ్లు పడిచస్తారు. కాబట్టే అక్కడ బ్లాక్ బస్టర్ అయింది సాహో.

ఇక ఇంత పెద్ద ఇమేజ్ ఉన్నా.. కథ నచ్చడంతో అవుట్ ఆఫ్ ఇమేజ్ తో చేసిన రాధేశ్యామ్ బానే ఉన్నా.. ఇమేజ్ ఇష్యూ వల్లే ఓవరాల్ గా పోయింది. బట్.. ఆదిపురుష్ మాత్రం సెల్ఫ్ డామేజ్ అనే చెప్పాలి. ఓ తెలుగువాడుగా ఆదిపురుష్ దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడే రిజెక్ట్ చేసి ఉండాల్సింది. లేదా మేకింగ్ టైమ్ లోనే తప్పుకోవాలి.

ఇవన్నీ కాక అందర్లానే టీజర్ వచ్చాక చూశాడు. అభిమానులతో పాటు అతనూ షాక్ అయ్యాడు. అందుకే ‘ఓమ్ కమ్ టు మై రూమ్’ అనే కమెంట్ వచ్చింది. బాహుబలి లాంటి సినిమా వచ్చాక అసలు ఇలాంటి సినిమాలా చేసేది అంటూ కొంతమంది ఎప్పటి నుంచో చెబుతున్నారు. బట్ అతని ప్లానింగ్ అతనిది. అయినా ఆదిపురుష్ లాంటి ప్లానింగ్ అవసరమా అనేది అభిమానులు కూడా అనుకునే మాట.


ఇక ఆదిపురుష్‌ అంటే ఓ బాలీవుడ్ దర్శకుడు చేసిన డామేజ్. బట్ ఇప్పుడు తెలుగు దర్శకుడే చేశాడు. ఊహించని డామేజ్ ఇది. ప్రాజెక్ట్ కే తో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా మరోసారి సగర్వంగా తలెత్తుకుంటుంది అనుకున్నారు. కానీ అంత లేదని.. మొదటి బొమ్మకే తేల్చాడు దర్శకుడు. తనేదో అద్భుత కళాఖండాన్ని తీస్తున్నాడని అంతా భావించారు. అందుకే అమితాబ్, కమల్ హాసన్, దీపిక వంటి బిగ్ స్టార్ కాస్ట్ కూడా యాడ్ అయింది అనుకున్నారు.

బట్.. నాగ్ అశ్విన్ కూడా హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టే ఈ కథనం మొదలుపెట్టాడు అనిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పై ప్రపంచ వ్యాప్తంగా సెటైర్స్ పడుతున్నాయి. దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఐరన్ మేన్ బాడీలోకి ప్రభాస్ తలను అతికించారు అంటున్నారు.ఓ టివి ఛానల్ వారికి ఇచ్చినా ఇంతకంటే బెటర్ గా ఆ తలను ఫిక్స్ చేసేవారూ అంటున్నారు.అసలు ప్రభాస్ కే ఎందుకు ఇలా జరుగుతోంది అనిపిస్తోంది కూడా. లేదంటే తన కటౌట్ కు ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ కు వెళ్లాల్సిన వాడు.. ఇక్కడిక్కడే విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడే ట్రోల్స్ కు గురవుతున్నాడు.ఈ కంటెంట్ తో హాలీవుడ్ ఆడియన్స్ ను మాత్రం ఎలా ఎంటర్టైన్ చేస్తాడు..?


నిజానికి నాగ్ అశ్విన్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కథ ఎంచుకున్నాడు. అందుకే ఆ కంటెంట్ పై పట్టున్న సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుగారిని కూడా స్క్రిప్ట్ లో భాగస్వామిగా చేసుకున్నాడు.సింగీతం వల్లే ఈ ప్రాజెక్ట్ లోకి కమల్ హాసన్ వచ్చాడు అనేది నిజం. కేవలం ఆయనపై నమ్మకంతోనే లోకనాయకుడు నాగ్ అశ్విన్ ను నమ్మాడు. మరి అతను మాత్రం ఫస్ట్ లుక్ తేలిపోయాడు.నిజానికి దీపికా పదుకోణ్ ఫస్ట్ లుక్ కూడా ఏమాత్రం బాలేదు. అందులో ఏ క్రియేటివిటీ లేదు.అలాంటి దీపిక ఫోటోలు గూగుల్ లోనే చాలా ఉన్నాయి. ఏదేమైనా ప్రాజెక్ట్ కే తో నాగ్ అశ్విన్ ఏదో చేస్తాడు అనుకుంటే ఫస్ట్ లుక్ కే తేలిపోయాడు. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. మొదటి అడుగే

Related Posts