రామ్ చరణ్ కూతురికి ఎన్టీఆర్ గిఫ్ట్

ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసింది. బట్ వాళ్లు అంతకు ముందు నుంచే మంచి స్నేహితులు అని ఆ టైమ్ లోనే చెప్పారు. వీరిమధ్య చాలాకాలంగా మంచి బాండ్ ఉందట. ఆర్ఆర్ఆర్ వల్ల అది మరింత బలపడింది.

టాలీవుడ్ లో ఇద్దరూ టాప్ హీరోలుగా ఉన్నారు. మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సినిమా వల్ల అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాన్ని నిలబెట్టుకునేందుకు ఎవరి రూట్ లోవాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ – చరణ్ మాత్రమే కాదు.. వారి కుటుంబాల మధ్య మంచి బంధమే ఉంది. అందుకే తన మిత్రుడికి చాలా కాలం తర్వాత కూతురు పుట్టడంతో ఎన్టీఆర్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగానూ పంచుకున్నాడు.


ఇక కొత్తగా సెన్సేషన్ అవుతోన్న మరో విషయం ఏంటంటే.. తాజాగా ఎన్టీఆర్ ఓ స్పెషల్ గిఫ్ట్ ను చరణ్ కూతురు క్లీంకార కోసం పంపించాడట. ఈ గిఫ్ట్ ను అతను స్పెషల్ గా చేయించాడు అని టాక్. చూడ్డానికి గోల్డ్ కాయిన్స్ లా కనిపిస్తూ.. తమ మధ్య ఉన్న మంచి బాండ్ ను ఎలివేట్ చేసేలా ఉంటుందట. ఆ గిఫ్ట్స్ పై చరణ్, ఉపాసనతో పాటు వారి కూతురు క్లీంకార పేర్లు కూడా కలిసొచ్చేలా డిజైన్ చేయించాడట.ఈ గిఫ్ట్ చూసిన చరణ్ దంపతులు కూడా చాలా మురిసిపోయారు అని చెబుతున్నారు.


ఎన్టీఆర్ చాలాసార్లు తనకు కూతురు పుట్టాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. కానీ అతనికి ఇద్దరూ కొడుకులే. అభయ్ రామ్, భార్గవ్ రామ్. అయినా ఆడపిల్లలు అంటే ఇష్టమని చెబుతూ.. కూతురు పుట్టిన వాళ్లు అదృష్టవంతులు అంటూ ఉంటాడు. అందుకే తన ఫ్రెండ్ కు కూతురు పుడితే తనూ ఆనందంగా ఫీలయ్యాడు. అందుకే ఈ గిఫ్ట్స్. ఇకపై కూడా క్లీంకారకు ఎన్టీఆర్ నుంచి మంచి గిఫ్ట్స్ వెళతాయి అనుకోవచ్చు.

Related Posts