నువ్వు కావాలయ్యా అంటే అజిత్ ఓకే అన్నాడు

ఏ ఆఫర్ ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా ఈ మధ్య ఆల్మోస్ట్ ఫేడవుట్ అనుకున్న సీనియర్ బ్యూటీస్ అంతా మళ్లీ ఫుల్ బిజీ అవుతున్నారు. అలాంటి భామల్లో త్రిష ముందు వరుసలో ఉంది.

ఎందుకంటే తనకు వచ్చేవన్నీ టాప్ హీరోల సినిమాలే. ప్రస్తుతం విజయ్ హీరో సరసన లియోలో నటించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.తర్వాత అజిత్ సరసన ఓ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. అయితే ఈ మూవీ నుంచి త్రిష తప్పుకుంది. అందుకు కారణం.. ముందుగా ఈ మూవీకి విఘ్నేష్ శివన్ డైరెక్టర్ అనుకున్నారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ తో అతను తప్పుకున్నాడు.

మరో దర్శకుడు వచ్చి కథపై పట్టు తెచ్చుకునేసరికి లేట్ అయింది. దీంతో త్రిష డేట్స్ మారిపోయాయి. తను అదే డేట్స్ లో మళయాల హీరో టోవినో థామస్ సరసన ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది.ఇప్పుడా ప్లేస్ తమన్నాకు వచ్చిందంటున్నారు.


తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్, తమిళ్ లో రజినీకాంత్ సరసన జైలర్ చిత్రాల్లో నటించింది. ఈరెండూ ఒకే రోజు విడదలవుతుండటం విశేషం. రీసెంట్ గా జైలర్ నుంచి వచ్చిన నువ్వు కావాలయ్యా అనే పాటతో పెద్ద సంచలనం సృష్టింది.

ఈ పాటలో తన సోయగాలు, స్టెప్పులకు అన్ని వయసుల వాళ్లూ ఊగిపోతున్నారు. ఈ పాటే ఇప్పుడు అజిత్ సరసన ఆఫర్ తెచ్చిందంటున్నారు. అజిత్ తో సినిమా అంటే తమన్నాకు అదో బోనస్ గానే చెప్పాలి. ఓ వైపు వెబ్ సిరీస్ లలో అడల్ట్ సీన్స్ లోనూ అదరగొడుతూ అటు బాలీవుడ్ లోనూ ఆఫర్స్ తెచ్చుకుంటోందీ మిల్కీ బ్యూటీ.

అలాంటి తనకు సౌత్ లోని ఓ టాప్ హీరో సరసన ఛాన్స్ రావడం అంటే తన కెరీర్ మళ్లీ కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. తన కెరీర్ ఆరంభంలోనూ ఇలాగే జరిగింది. తమన్నా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతో. కానీ స్టార్డమ్ వచ్చింది తమిళ్ లో. ఆ తర్వాతే మళ్లీ తెలుగులో స్టార్డమ్ తెచ్చుకుంది. సో.. ఇటు భోళా, అటు జైలర్ బ్లాక్ బస్టర్ అయితే అజిత్ ఏంటీ.. ఇక్కడా పెద్ద స్టార్స్ అమ్మడి వైపు చూస్తారనడంలో డౌటే లేదు.

Related Posts