టాలీవుడ్

ఆదిపురుష్‌ ఫంక్షన్ కు అతనెందుకు రాలేదు

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. దాదాపు లక్షకుపైగా అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లారు. ప్రభాస్ స్పీచ్ చాలామందిని ఆకట్టుకుంది. కృతి సనన్ కొంచెం తెలుగులో కూడా మాట్లాడాటం ఫ్యాన్స్ కు నచ్చింది.

దర్శకుడు ఓమ్ రౌత్ మాటల్లో అతిశయోక్తులు కనిపించినా.. ఓవరాల్ గా ఫంక్షన్ ను బాగానే అరేంజ్ చేశారు. ఇక ఈ వేదికపై సినిమాలో లక్ష్మణుడుగా నటించిన సన్నీ సింగ్, హనుమంతుడుగా కనిపించిన దేవదత్త నాగేలు కూడా పాల్గొని స్పీచ్ లు ఇచ్చారు.కానీ రామాయణ కావ్యానికి అసలు కారణమైన పాత్ర చేసిన సైఫ్ అలీఖాన్ మాత్రం ఈ వేదికపై కనిపించలేదు. దీంతో ఇదో పెద్ద లోటుగా భావిస్తున్నారు ప్రేక్షకులు.


రావణ పాత్ర చేయడం అదృష్టం అని చెప్పలేకపోవచ్చు.. కానీ ఎంత కాదనుకున్నా కేవలం ఇదో సినిమా. ఈ సినిమాకు సంబంధించి అతని ఎక్స్ పీరియన్స్ కూడా యాడ్ అయితే సినిమాకే ప్లస్ అవుతుంది. బట్ సైఫ్‌ ఇక్కడే కాదు.. ఇప్పటి వరకూ ఏ ప్రమోషనల్ యాక్టివిటీలో కూడా కనిపించడం లేదు.

మరి కావాలనే మేకర్స్ అతన్ని పక్కన బెడుతున్నారా లేక అతనికి ఇతర బిజీ షెడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియడం లేదు కానీ.. ఈ మొత్తంలో సైఫ్ ముస్లీం కాబట్టే పిలవడం లేదు అని కొందరు.. ఆ కారణంగానే అతను రావడం లేదు అని ఇంకొందరు ఎవరికి వారుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఒకప్పుడు హీరోగా సైఫ్‌ కు బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆక్రేజ్ ను ప్రమోషన్స్ లో కూడా ఉపయోగిస్తేనే నార్త్ బెల్ట్ లో ప్లస్ అవుతుంది.

Telugu 70mm

Recent Posts

‘Laggam’ is about to release

The fun, manners, games and songs in Telugu culture weddings make everyone remember their wedding…

3 mins ago

Director’s Day Grand Event on 19th May

Director Ratna Dasari Narayana Rao's birthday celebrations were grandly organized by the Telugu Film Directors…

13 mins ago

మే 19న డైరెక్టర్స్ డే గ్రాండ్ ఈవెంట్

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన…

2 hours ago

దర్శక శిఖరం దాసరి నారాయణరావు జయంతి

వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు శ్రీశ్రీ. ఆ మాటలు ఎంత నిజమో దాసరి నారాయణరావును చూస్తే అర్థమౌతుంది. ఓ దిగ్ధర్శకుడిగా…

2 hours ago

చెన్నై సోయగం త్రిష బయోగ్రఫీ

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్స్‌ స్పాన్ చాలా తక్కువనే నానుడి ఉంది. అయితే.. త్రిష వంటి కథానాయికను చూస్తే…

3 hours ago

విడుదలకు ముస్తాబవుతోన్న ‘లగ్గం’

తెలుగు కల్చర్ తో జరిగే పెళ్లిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల…

3 hours ago