టాలీవుడ్

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు ఏమైంది..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా గురించి ఎప్పటి నుంచో చూస్తున్నారు. సలార్ కంటే ముందే వీరి కాంబోలో సినిమా వస్తుందనుకున్నారు. బట్ సడెన్ గా సలార్ స్టార్ట్ అయింది. దీంతో నెక్ట్స్ ఇక ఎన్టీఆర్ తోనే అనుకున్నారు. బట్ అలా జరగడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమాలో నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఈ యేడాది నవంబర్ కు అయిపోతుంది. తర్వాత బాలీవుడ్ లో కమిట్ అయిన వార్ 2 షూటింగ్ కు వెళతాడు యంగ్ టైగర్. అయితే వార్2 తో పాటు కాస్త అటూ ఇటూగా .. ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయా మధ్య. బట్ అది నిజం కాదట. ఈ చిత్రం 2024 చివర్ లో స్టార్ట్ అవుతుందంటున్నారు.

అంటే రిలీజ్ అయ్యేది 2025లో అన్నమాట. మరి ఇలా ఎందుకు జరుగుతోంది.. అసలు ఈ కాంబోలో సినిమా ఉంటుందా ఉండదా అనే చర్చలు తెలుగులోనే కాదు.. కన్నడ నాట కూడా జరుగుతుండటం విశేషం.
ఎన్టీఆర్ కు తెలుగుతో పాటు కన్నడలో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఈ కాంబోలో సినిమా కోసం వారు కూడా చూస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కమిట్మెంట్స్ చూస్తే సలార్ మీదే ఉన్నాయట. ఈ యేడాది సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 విడుదలవుతుంది. అయితే ఇదే చిత్రానికి పార్ట్ 2ను కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్. ఇప్పటికే షూటింగ్ మాగ్జిమం పూర్తయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ లో ట్రైలర్ వస్తుంది.

ఆ తర్వాత ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ప్రమోషన్స్ ఉంటాయి. రిలీజ్ తర్వాత కూడా కొంత హడావిడీ ఉంటుంది. అది తగ్గిన తర్వాత ఎన్టీఆర్ సినిమా అనేది ప్లాన్. బట్ ఈ ప్లానింగ్ లో మార్పులు వచ్చాయి. సలార్ సెకండ్ పార్ట్ 2024 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు కాబట్టి.. ఆ పార్ట్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకోవాలి ప్రశాంత్. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్ స్టార్ సినిమా కాబట్టి.. కో డైరెక్టర్స్ కు వదిలేయలేడు.

పైగా ఫస్ట్ పార్ట్ ఏదైనా తేడా వస్తే మళ్లీ కొన్ని మార్పులు చేయాలి. అవన్నీ ఎన్టీఆర్ తో సినిమా చేస్తూ మధ్యలో అటు వెళ్లడం ఎందుకు అనే.. తమ కాంబోలో వచ్చే సినిమాను కాస్త వెనక్కి జరిపారట.


సో.. నెక్ట్స్ సమ్మర్ నుంచి ఆగస్ట్ వరకూ ఎన్టీఆర్ కూడా వార్2 సినిమాతో బిజీగా ఉంటాడు. అతను ఆ బిజీ నుంచి ఫ్రీ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ లైన్ లోకి వస్తాడు. అదన్నమాట. సో.. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఈగర్ గా చూస్తున్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం నిరీక్షించాల్సిందే అన్నమాట.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

7 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

7 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

8 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

8 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

13 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

14 hours ago