టాలీవుడ్

ప్రభాస్ ఫ్యాన్స్ కాచుకోండిక

ఆదిపురుష్‌ ఫ్లాప్ అయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ కాలేదు. అందుకు కారణం.. ఈ ఫ్లాప్ కు ప్రిపేర్ గా ఉండటం ఒకటైతే.. నెక్ట్స్ సలార్ ఉంది కదా అనే ధైర్యం. ఆ ధైర్యానికి మరింత హోప్ ఇస్తూ రీసెంట్ గా వచ్చిన సలార్ టీజర్ దుమ్మురేపింది.

ఊహించినంత కంటెంట్ లేకపోయినా.. ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా.. డిజిటల్ మీడియంలో రికార్డులు క్రియేట్ చేస్తూ సాగుతోంది సలార్. ఇప్పటికే యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. కౌంట్ కంటిన్యూ అవుతోంది. అయితే సలార్ టీజర్ మాత్రం ఆశించినంత గొప్పగా లేదనే చెప్పాలి. ఎంత వద్దనుకున్నా.. కేజీఎఫ్‌ తో కంపేర్ చేస్తూ దానితో చూస్తే తేలిపోయిందనే కమెంట్స్ వచ్చాయి. పైగా టీజర్ చూస్తే ఇది కేజీఎఫ్‌ కు కంటిన్యూనిటీలా ఉంది. అయితే ప్రశాంత్ నీల్ కావాలనే సినిమాపై హైప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది సలార్ మూవీ ప్రొడక్షన్ హౌస్.


ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. ఆగస్ట్ లో డేట్ లు సరిగ్గా చూసుకోమని సూచిస్తూనే.. ఆగస్ట్ లోనే ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీంతో చాలామంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ట్రైలర్ వస్తుందనుకున్నారు.

బట్ టీజర్ పై వచ్చిన కమెంట్స్ వల్లో లేక ప్రమోషన్స్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి అనుకున్నారో కానీ.. ఆగస్ట్ లోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు ఫ్యాన్స్ కు అప్డేట్ ఇస్తూ ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం వినిపించే దాన్ని బట్టి ఆగస్ట్ మూడో వారంలోనే ట్రైలర్ విడుదల చేయొచ్చు అంటున్నారు. సో.. ఈ లోగా ఓ లిరికల్ సాంగ్ లాంటిది ఏదైనా విడుదల చేస్తే ఫ్యాన్స్ మరింత ఖుషీగా ఉంటారేమో.


ఇక సలార్ లో ప్రభాస్ కు విలన్ గా మళయాల స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. టీజర్ లో అతన్ని కూడా చూపించారు. ఫీమేల్ లీడ్ లో శృతి హాసన్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వీరితో పాటు జగపతిబాబు, ఈశ్వరీరావులకూ కీలక పాత్రలే ఉన్నాయంటున్నారు. మొత్తంగా సలార్ పూర్తి సందడి ఆగస్ట్ నుంచి మొదలవుతుందన్నమాట.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

9 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

11 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

12 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

12 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

12 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

17 hours ago