ప్రభాస్ ఫ్యాన్స్ కాచుకోండిక

ఆదిపురుష్‌ ఫ్లాప్ అయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ కాలేదు. అందుకు కారణం.. ఈ ఫ్లాప్ కు ప్రిపేర్ గా ఉండటం ఒకటైతే.. నెక్ట్స్ సలార్ ఉంది కదా అనే ధైర్యం. ఆ ధైర్యానికి మరింత హోప్ ఇస్తూ రీసెంట్ గా వచ్చిన సలార్ టీజర్ దుమ్మురేపింది.

ఊహించినంత కంటెంట్ లేకపోయినా.. ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా.. డిజిటల్ మీడియంలో రికార్డులు క్రియేట్ చేస్తూ సాగుతోంది సలార్. ఇప్పటికే యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. కౌంట్ కంటిన్యూ అవుతోంది. అయితే సలార్ టీజర్ మాత్రం ఆశించినంత గొప్పగా లేదనే చెప్పాలి. ఎంత వద్దనుకున్నా.. కేజీఎఫ్‌ తో కంపేర్ చేస్తూ దానితో చూస్తే తేలిపోయిందనే కమెంట్స్ వచ్చాయి. పైగా టీజర్ చూస్తే ఇది కేజీఎఫ్‌ కు కంటిన్యూనిటీలా ఉంది. అయితే ప్రశాంత్ నీల్ కావాలనే సినిమాపై హైప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది సలార్ మూవీ ప్రొడక్షన్ హౌస్.


ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. ఆగస్ట్ లో డేట్ లు సరిగ్గా చూసుకోమని సూచిస్తూనే.. ఆగస్ట్ లోనే ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీంతో చాలామంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ట్రైలర్ వస్తుందనుకున్నారు.

బట్ టీజర్ పై వచ్చిన కమెంట్స్ వల్లో లేక ప్రమోషన్స్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి అనుకున్నారో కానీ.. ఆగస్ట్ లోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు ఫ్యాన్స్ కు అప్డేట్ ఇస్తూ ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం వినిపించే దాన్ని బట్టి ఆగస్ట్ మూడో వారంలోనే ట్రైలర్ విడుదల చేయొచ్చు అంటున్నారు. సో.. ఈ లోగా ఓ లిరికల్ సాంగ్ లాంటి�