స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన స్కంద ఈ గురువారం విడుదలైంది. శ్రీ లీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. మాస్ డోస్ మరీ ఓవర్ అయిందన్నారు ఆడియన్స్.

దీనికి తోడు ఎంత బోయపాటి సినిమా అయినా ఏ లెక్కలూ, కాలిక్యులేషన్స్ అన్నీ హద్దులు దాటి కనిపిస్తే చూసేవారికి వెగటు వస్తుంది. ఈ స్కంద విషయంలో అదే జరిగింది. హీరోగా రామ్ దర్శకుడు చెప్పింది చేయడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. బట్ అతని కష్టాన్ని బోయపాటి మరీ సిల్లీగా మార్చాడు. అందుకే ఈ చిత్రానికి ఆశించిన టాక్ అయితే రాలేదు. బట్ కాంబినేషన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మాత్రం బానే వచ్చాయి.
మొదటి రోజు స్కంద చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 18. 2 కోట్ల వసూళ్లు వచ్చాయి.

ఈ కంటెంట్ తో ఆ కలెక్షన్స్ అంటే చాలా బెటర్ అనే చెప్పాలి. పైగా రిలీజ్ రోజు వినాయక నిమజ్జనం ఉంది. అయినా 18 కోట్లు అనేది మంచి ఫిగర్ అనే చెప్పాలి. ఇక టాక్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి.. ఈ వీకెండ్ లో ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇలాంటి ఊరమాస్ మూవీస్ ను కూడా ఆడియన్స్ ఈ మధ్య హిట్ చేస్తున్నారు. అలా ఈ స్కంద గట్టెక్కుతుందా లేదా అనేది అంచనాలకు అందడం లేదు.


ఇక ఈ మూవీకి థియేట్రికల్ టార్గెట్ 60 కోట్లు. తొలి రోజు ఊపు కొనసాగితే వీకెండ్ వరకూ మాగ్జిమం నంబర్స్ కలెక్ట్ చేయొచ్చు. లేదా టాక్ ను బట్టి డల్ అయితే మాత్రం థియేట్రికల్ గా ఫ్లాప్ మూటకట్టుకుంటుంది.

Related Posts